BigTV English

Chiranjeevi : రజినీ సూపర్ హిట్ మూవీ.. రిజెక్ట్ చేసిన మెగాస్టార్.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Chiranjeevi : రజినీ సూపర్ హిట్ మూవీ.. రిజెక్ట్ చేసిన మెగాస్టార్.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Chiranjeevi : జైలర్ మూవీ రీ రికార్డింగ్ పై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చ కు దారితీశాయి. మెగాస్టార్ చేసిన ఆ వ్యాఖ్యలు జైలర్ మూవీని ఉద్దేశించి అన్నవే అన్నట్టుగా.. కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చ మధ్యలో కొత్తగా రజిని మూవీ ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించడం పై ప్రముఖ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి.


రజినీకాంత్ నటించిన అన్ని చిత్రాలు ఒక ఎత్తు అయితే బాషా మూవీ మాత్రం ఒక ఎత్తు. ఈ మూవీ జనవరి 15, 1995లో విడుదలైంది. అప్పటివరకు ప్రేక్షకులకు సినిమాల్లో హీరోయిజం పై ఉన్న ఒపీనియన్ ను బాషా చిత్రం పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. స్టోరీ టెల్లింగ్, ఫిలిం మేకింగ్ కు ఈ మూవీ ఒక దిశా నిర్దేశం చేయడంతో పాటు ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచింది. హీరో పాత్ర చిత్రానికి ఎంత ముఖ్యమో ఒక భిన్నమైన వైఖరిలో ప్రదర్శించిన ఈ చిత్రం.. మూవీ మేకింగ్ కు ఒక కొత్త ప్రామాణికాన్ని సెట్ చేసింది.

ఇప్పటికీ గతాన్ని దాచిపెట్టి కామన్ మ్యాన్ గా తిరిగే ఒక హీరో బ్యాక్ డ్రాప్ ఏ మూవీ లో ఉన్నా దాని వెనుక మాణిక్ బాషా ఝలక్ ఉంటుంది. అలాంటి మూవీ చేసే ఆఫర్ మెగాస్టార్ వదులుకున్నారు అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాన్ని డైరెక్టర్ సురేష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. బాషా సినిమా తెలుగులో మొదట డబ్బింగ్ వర్షన్ కాకుండా రీమేక్ చేసే రిలీజ్ చేయాలి అని భావించారు. అయితే ఈ పాత్రకి తెలుగులో ఏ నటుడు న్యాయం చేయగలడు అని అనుకున్నప్పుడు మెగాస్టార్ అయితే దీనికి కరెక్ట్ గా సరిపోతాడు అని అనుకున్నారట.


అప్పటికే ఎన్నో కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న చిరంజీవి ఈ మూవీ చేయలేకపోయారు. 1995 బాషా భారీ విజయాన్ని సాధించిన తర్వాత ..డైరెక్టర్ సురేష్ కృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవితో ఈ సినిమా వర్కౌట్ కాకపోవడంతో చేసేదిలేక దీనిని తెలుగు వర్షన్ డబ్ చేసి విడుదల చేశామని చెప్పారు. అయితే భాషా తెలుగులో డబ్బింగ్ మూవీ గా రావడంతో అప్పట్లో రజినీకాంత్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. అయితే ఎందుకో రజినీకాంత్ మాత్రం ఈ చిత్రం మోహన్ బాబు చేయలేరా అని అడిగారట. మరి చిరంజీవి కంటే మోహన్ బాబు ఈ పాత్రకి సరిపోతాడని రజిని ఎందుకు భావించాడో అతనికే తెలియాలి. ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అయిన చిత్రానికి ఇప్పటివరకు సీక్వెల్ లేకపోవడం ఆశ్చర్యకరమే. అయితే ఇప్పటి జనరేషన్ లో మాణిక్ బాషాగా ఏ నటుడు సెట్ అవుతాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×