BigTV English

Rahul Gandhi ChitChat : ఆ వంటలంటే నచ్చవట.. తన బ్యూటీ సీక్రెట్ చెప్పిన రాహుల్

Rahul Gandhi ChitChat : ఆ వంటలంటే నచ్చవట.. తన బ్యూటీ సీక్రెట్ చెప్పిన రాహుల్

Rahul Gandhi ChitChat : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న మహారాణి కళాశాల విద్యార్థినులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. విద్యార్థినులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ.. వారితో అనేక విషయాలపై మాట్లాడారు. రాహుల్ గాంధీని చూసిన ఆనందంలో విద్యార్థినులు ఆయన వ్యక్తిగత జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగారు. చదువుకునే రోజుల్లో మీ క్రష్ ఎవరు అని అడగ్గా.. అది మీరు ఇప్పుడు చూస్తే.. అంటూ రాహుల్ సమాధానం దాటవేశారు.


మరో విద్యార్థిని..సర్, మీరు చాలా స్మార్ట్ గా, అందంగా ఉన్నారు కదా.. ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం నేను నా పనిలో .. కాంగ్రెస్ పార్టీ పనిలో నిమగ్నమై ఉన్నాను.. పెళ్లి గురించిన ఆలోచన లేదని రాహుల్ తెలిపారు. తొలుత విద్యార్థినులతో మాట్లాడిన రాహుల్.. కష్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ తాను భారత్ జోడో యాత్ర చేసిన సమయంలో కొందరు గ్రాడ్యుయేట్లను డిగ్రీలు పూర్తయ్యాక ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. తమ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తామని చెప్పారన్నారు. అదే ప్రశ్న మహారాణి కాలేజీ విద్యార్థినులను కూడా రాహుల్ అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగం చేయమని తాము తమ తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటామన్నారు. కానీ.. కనీసం ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే అప్పుడు మీకు నచ్చింది చేయమని చెప్తారన్నారు.

జీవితంలో స్థిరపడాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే దారి అని తల్లిదండ్రులు అంటారని చెప్పుకొచ్చారు. డాక్టర్లు లేదా ఇంజినీర్లు అవ్వాలనుకుంటే.. ముందు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్తారన్నారు. అందుకు రాహుల్ ప్రతిస్పందిస్తూ.. ఇక్కడ సమస్య సిస్టమ్ లోనే ఉందన్నారు. జీవితంలో ఎవరు ఏమి అవ్వాలనుకుంటున్నారో వారి ఇష్టానికి వదిలేయకుండా 3-4 ఆప్షన్లు ఇచ్చి.. వాటిలో ఏదొఒకటి ఎంచుకోవాలని చెప్పడం వల్లే యువత తాము అనుకున్నది సాధించలేకపోతుందన్నారు. యువత తమ ఆలోచనలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఈ సిస్టమ్ మారాలని రాహుల్ అభిప్రాయపడ్డారు.


ఉమెన్ రిజర్వేషన్ గురించి కాలేజీ ప్రొఫెసర్ ఇలా ప్రశ్నించారు. మన దేశంలో 50 శాతం మహిళలు ఉన్నారని మీరే చెప్పారు.. కానీ.. కేవలం 30 శాతం రిజర్వేషన్లు ఎందుకు? అని అడగ్గా.. తాను వియత్నాంలో ఉన్నపుడు అక్కడ మహిళలు ఎంతో కాన్ఫిడెంట్ గా, ఎలాంటి భయం లేకుండా జీవించేవారని గుర్తించానని తెలిపారు. ఇలా ఎలా ఉంటున్నారు అని అడగ్గా..ఇదే తమకు లభించిన స్వాతంత్ర్యమని చెప్పారన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే తక్కువ కాదు.. అలాంటప్పుడు మహిళలకు ఎందుకు పురుషులకంటే తక్కువ హక్కులు ఉన్నాయన్న ఆలోచనలో నుంచే ఈ మహిళా రిజర్వేషన్ ఆలోచన వచ్చిందన్నారు.

ఆ తర్వాత విద్యార్థినులతో సరదాగా నిర్వహించిన చిట్ చాట్ లో.. రాహుల్ ను కొన్ని ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ తాను వెళ్లని ప్రదేశం ఉంటే.. అదే తన ఫేవరెట్ ప్లేస్ అన్నారు. కొత్తప్రదేశాలను చూడటం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అలాగే.. వంటల్లో అన్నిరకాల వంటలు ఇష్టమే కానీ.. కాకరకాయ, బఠానీలు, పాలకూరతో చేసే వంటలు నచ్చవన్నారు. రాహుల్ స్కిన్ కేర్ గురించి అడగ్గా.. తాను ముఖానికి అస్సలు సబ్బులు, క్రీమ్ లు వాడనని తెలిపారు. కేవలం స్వచ్ఛమైన, సహజమైన నీటితో కడుక్కుంటానని చెప్పారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×