E-Paper
Advertisement

Megastar Chiranjeevi : మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్..!

Megastar Chiranjeevi : మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్..!
Advertisement

Megastar Chiranjeevi : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. స్వయం కృషి తో కష్టాలను అధిగమిస్తూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన స్టార్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి. ఈయన గురించి, ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఎన్నో పేజీలు మిగిలే ఉంటాయి. హీరోగానే కాదు. సాయం కోరిన వారికి సాయం అందించడంలో అభయన్న హస్తం.. అలాంటి చిరుకి ఈ ఏడాది రెండు అవార్డులు వచ్చాయి. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డును చిరంజీవి అందుకున్నారు.. ఆ అవార్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

లెజండరి యాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ 22 న ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.తన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో 156 చిత్రాలు, 537 పాటలు.. 24 వేల స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.ఈ అవార్డు దక్కించుకున్న మొదటి నటుడిగా ఆయన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆ అవార్డు రావడం పై యావత్ సినీ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ న్యూస్ ఇంక మర్చిపోలేదు అప్పుడు మరో అవార్డు దక్కింది.

Advertisement

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ లోని అబుదాబి లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌ 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సహచర హీరోలు బాలకృష్ణ ,విక్టరీ వెంకటేష్ కూడా హాజరయ్యారు. అవార్డు అందుకున్న చిరంజీవిని అభినందించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవిని హగ్ చేసుకున్నారు. దీనికి సంబధించిన వీడియో,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది బాగా కలిసోచ్చింది. వరుసగా అవార్డుల పంట పండింది. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటిని ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×