BigTV English

Trinayani Serial Today September 28th: ‘త్రినయని’ సీరియల్‌: భుజంగమణి కోసం వచ్చిన గజగండ – చంపేస్తానన్న విక్రాంత్

Trinayani Serial Today September 28th: ‘త్రినయని’ సీరియల్‌: భుజంగమణి కోసం వచ్చిన గజగండ – చంపేస్తానన్న విక్రాంత్

 trinayani serial today Episode:  విశాల్‌  చేతిలో ఉన్న భుజంగమణిని చూసిన సుమన అది తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే నయని ఆపుతుంది. నీలాంటి  వాళ్లు టచ్ చేయకూడదని చెప్తుంది. దేవుణ్ని అందంగా అలంకరణ చేస్తే దూరం నుంచి చూసి దండం పెట్టుకోవాలి కానీ అందంగా ఉందని ఇంటికి తెచ్చుకోకూడదమ్మా అంటాడు కోవెలమూర్తి. ఇంతలో తిలొత్తమ్మ చూడటానికి పంచకమణి కన్నా చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంటుంది అంటుంది.


గజగండ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదా అని కోవెలమూర్తి అడగ్గానే మేము అమ్మవారి గుడిలోకి అడుగుపెట్టకుండా చేశాడు. కానీ ఆ తల్లి దయ మా మీద ఉండటం వల్ల మేము గుడిలోకి అడుగుపెట్టాము అని చెప్తాడు విశాల్‌. మీ అమ్మ పేరు పెట్టుకున్న గాయత్రి పాప కూడా మనకు హెల్ప్‌ చేసిందని చెప్తుంది నయని. ఎలా అని తిలొత్తమ్మ అడగ్గానే చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుందని టిఫిన్‌ చేస్తూ మాట్లాడుకుందాం అంటాడు విశాల్‌.

విక్రాంత్‌ పంతులుకు ఫోన్‌ చేసి తమ పేరు మీద గుడిలో అన్నదానం చేయించండి అని చెప్తాడు. అమ్మవారికి పట్టువస్త్రాలు ఇవ్వండని మేనేజర్‌ వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్తాడు. ఇంతలో సుమన అక్కడికి వచ్చి విక్రాంత్‌ ను తిడుతుంది. ఎప్పుడూ అన్న వదిన గురించేనా అంటుంది. నీకెప్పుడు కాలు పడిపోతుంది అంటుంది.


సుమనను కోపంగా తిడతాడు విక్రాంత్‌. ఎక్కడ దొరికావే నువ్వు అంటూ కొట్టబోతాడు. గజగండ దగ్గర ఉన్న పంచకమణిని సంపాదించి రెండిటినీ తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఆ భుజంగమణిని తీసుకొచ్చింది అని విక్రాంత్‌ చెప్పగానే మా అక్క అంత తెలివితక్కువది కాదు. దసరాకు పూజలు చేసుకోకుండా మా అక్క అడవికి వెళ్తుందా? అని చెప్పి వెళ్లిపోతుంది.

వల్లభ కోపంగా మమ్మీ నువ్వు సర్పదీవికి వెళ్లి ఏం తీసుకొచ్చావే తెలియదు కానీ చెయ్యి అయితే కాల్చుకుని వచ్చావు. పంచకమణిని పట్టుకోగానే నీ చెయ్యి మామూలుగా మారిపోయింది. సేమ్‌ టూ సేమ్‌ విశాల్‌ తమ్మి కూడా భుజంగమణిని టచ్‌ చేయగానే కిక్‌ బాక్సర్‌ లాగా మారిపోయాడు. పైగా మణిని కూడా తీసుకొచ్చారు అంటాడు వల్లభ. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను వల్లభ. నయని సాధించిన భుజంగమణి కోసమే గజగండ బతికి ఉన్నాడు తెలుసా? పంచకమణిని పట్టుకుంటేనే నా చేయి నయం అయినప్పుడు దాన్ని చేజిక్కించుకుంటే ఇక నాకు తిరుగే ఉండదు అంటుంది తిలొత్తమ్మ.

నువ్వు ఎన్ని చెప్పినా జరగవు కానీ ఆ భుజంగమణిని చూశాక ఇక నేను మెయిన్‌ విలన్‌ గా మారాలనుకుంటున్నాను అంటాడు వల్లభ. నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ పాలు తాగాలనుకుంటే కుదరదు మమ్మీ అని వల్లభ చెప్పగానే నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పరా? అని అడుగుతుంది. దీంతో నాకు నిద్ర పట్టాలి అంటే గేదే పాలో, ఆవు పాలో తాగను మమ్మీ బాదం పాలు తాగుతాను అని సీరియస్‌ గా వల్లభ చెప్పగానే వల్లభను కొడుతుంది తిలొత్తమ్మ నువ్వు సీరియస్‌ ముఖం పెట్టి చెప్తుంటే ఎంత భయంకరమైన విషయం చెప్తున్నావో అనుకున్నాను కానీ బాదంపాల గురించి చెప్తున్నావా? రాస్కెల్‌ అంటూ తిట్టి వెళ్లిపోతుంది.

విశాల్‌, గాయత్రి పాపతో ఆడుకుంటుంటాడు. నయని వచ్చి హ్యపీగా ఎన్నాళైంది బాబుగారు మళ్లీ మీరు ఇలా పిల్లలతో ఆడుకుని అంటుంది. మళ్లీ ఇలంటి రోజు వస్తుందో లేదోనని మనసులో చాలా స్ట్రగుల్‌ అయ్యేవాణ్ని నయని అంటాడు విశాల్‌. మాకు ధైర్యం చెప్పే మీరే ఇంత బయపడ్డారంటే నమ్మలేకపోతున్నాను బాబుగారు అంటుంది నయని. ఇక ముందైతే పోరాటం చేయాలి. భుజంగమణి కోసం గజగండ తప్పకుండా వస్తాడు అని విశాల్‌ హెచ్చరిస్తాడు.

దీంతో నేను వాడి కోసమే నేను ఎదురుచూస్తున్నాను. గాయత్రి అమ్మా బిక్ష తిని బతికిన వాడు ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటుంది నయని. మా అమ్మ చేతి బిక్ష తిన్నొడిని క్షమించకూడదు  నయని అంటాడు విశాల్‌. దీంతో మరి మీరెందుకు తిలొత్తమ్మ అత్తయ్యను క్షమిస్తున్నారు అని అడుగుతుంది నయని.  దీంతో నీ ప్రశ్నలో ఇరకాటం ఉన్నా సరే సమాధానం తెలుసుకోవాలన్న ఆరాటం కనిపిస్తుంది నయని అంటాడు విశాల్‌.

అందరూ హాల్లో కూర్చుని ఉండగా గజగండ వచ్చి భుజంగమణి కోసం వచ్చానని చెప్తాడు. వల్లభ భయపడుతుంటే కంగారుపడకు వల్లభ ఇక్కడేం గొడవలు జరగవు అంటాడు గజగండ. దీంతో ఒక్క చావు తప్పా  అది కూడా నీదే అంటాడు విశాల్‌. అవును బ్రో ఈరోజు వీణ్ని ఇక్కడే శవాన్ని చేయాలి అంటాడు విక్రాంత్‌. మన ఇంట్లో పూల మొక్కలు నాటాలి కానీ ఇలాంటి వాడి శవాన్ని పూడుస్తా అంటారేంటి విక్రాంత్‌ బాబు అంటుంది నయని.

విశాల్‌.. గజగండ దహనసంస్కరాలు జరగబోతున్నాయి. వాళ్లావిడ గంటలమ్మకు సమాచారం పంపండి అమ్మా అంటాడు విశాల్‌. దీంతో కూల్ విశాల్‌. మీరంతా కొంచెం ఓపిక పట్టి నేను చెప్పేది వినండి అంటూ గజగండ కొడుకుని పోగొట్టుకున్నా.. తను ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు అని చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో విశాల్ గజగండ దగ్గర ఉన్న పంచకమణిని కూడా తీసుకుని మానసాదేవి గుడికి చేర్చడమే నయని ముందున్న లక్ష్యం అని చెప్తాడు.  దీంతో భుజంగమణిని నాకిస్తే.. పంచకమణిని మీకిస్తాను. దాంతో పాటు అష్టైశ్వార్యాలను మీకిస్తాను అని చెప్తాడు గజగండ. దీంతో అవసరం లేదని చెప్తాడు విశాల్ ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×