BigTV English

Mohanlal: రజినీకాంత్‌తో నాకు పోటీ లేదు.. మోహన్‌లాల్ కామెంట్స్

Mohanlal: రజినీకాంత్‌తో నాకు పోటీ లేదు.. మోహన్‌లాల్ కామెంట్స్

Mohanlal: ఈరోజుల్లో యంగ్ హీరోల మధ్య మాత్రమే కాదు.. సీనియర్ హీరోల మధ్య కూడా విపరీతమైన పోటీ ఉంది. స్టోరీ సెలక్షన్ విషయంలో, బ్యాక్ టు బ్యాక్ సినిమాల విషయంలో సీనియర్ హీరోలంతా ఒక రేంజ్‌లో పోటీపడుతున్నారు. కేవలం తెలుగులోనే కాదు.. ప్రతీ భాషా ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి. తాజాగా మోహన్ లాల్ కూడా సీనియర్ హీరోల మధ్య ఉన్న పోటీపై స్పందించారు. ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన అప్‌కమింగ్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మార్చి నెలాఖరున విడుదల కావాల్సిన ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం కష్టపడుతున్నారు. అదే క్రమంలో తనకు రజినీకాంత్‌తో ఉన్న పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ లాల్.


వారిపై కామెంట్స్

పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమానే ‘ఎల్2ఈ ఎంపురాన్’. చాలా ఏళ్ల క్రితం విడుదలయిన ‘లూసీఫర్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత మరింత భారీ బడ్జెట్‌తో, థ్రిల్లింగ్ స్టోరీతో ‘ఎల్2 ఎంపురాన్’ (L2 Empuraan) తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాబట్టి దీనికి లాభాలు కూడా అదే రేంజ్‌లో రావాలని మేకర్స్ అంతా తెగ కష్టపడుతున్నారు. బ్రేకుల్లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ లాల్.


ఫోన్ చేశాడు

‘ఎల్2 ఎంపురాన్’ ట్రైలర్ విడుదలయిన తర్వాత రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ పర్సనల్‌గా తనకు ఫోన్లు చేసి మరీ ప్రశంసించారని బయటపెట్టారు మోహన్ లాల్. ‘‘ఎల్2 ఎంపురాన్ ట్రైలర్ చూసిన తర్వాత రజినీకాంత్ చాలా ఎగ్జైట్ అయ్యారు. నాకు ఫోన్ చేశారు. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. అసలు నువ్వేం చేశావు..? చాలా బాగుంది అని అన్నారు. వాళ్లు నిజంగానే మా ట్రైలర్‌ను ప్రశంసించారు. మా మధ్య ఉన్నది పోటీ కాదు.. నిజమైన ప్రశంసలు. రజినీకాంత్ ఒక నిర్మాత కాబట్టి ఆయనకు మా సినిమా స్కేల్ చాలా నచ్చింది. మీరు సినిమాపై చాలా ఖర్చుపెట్టారని నాకు కనిపిస్తుంది అన్నారు’’ అని చెప్పుకొచ్చారు మోహన్ లాల్.

Also Read: అబ్బే అస్సలు సెట్ అవ్వలేదు.. చిరు గాడ్ ఫాదర్‌పై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్

మేము అన్నదమ్ముళం

హీరోలంతా అన్నదమ్ములలాగా ఉంటున్నా కూడా చూసే ప్రేక్షకులకు మాత్రం అది పోటీలాగా అనిపిస్తుందని తెలిపారు మోహన్ లాల్ (Mohanlal). అక్కడ జరిగేది ఒకటి, ప్రేక్షకులు అర్థం చేసుకునేది ఒకటి అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మమ్ముట్టిని తన బ్రదర్ అని, సొంత ఫ్యామిలీలాగా ఫీలవుతానని తెలిపారు. కచ్చితంగా హీరోలకు ఒకరి సపోర్ట్ మరొకరికి ఉంటుందని అన్నారు. అమితాబ్ బచ్చన్ సైతం ‘ఎల్2 ఎంపురాన్’ ట్రైలర్ చూసిన తర్వాత దీనిపై ట్వీట్ చేయడం గురించి గుర్తుచేసుకున్నారు. మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా తెలిపారు. ‘ఎల్2 ఎంపురాన్’ చూసిన చాలామంది సెలబ్రిటీల్లో రజినీకాంత్ ఒకరు. కానీ అందరికంటే ముందే రజినీకాంతే ఈ ట్రైలర్‌పై రియాక్ట్ అయ్యారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×