Reliance Jio Cheapest Plan: దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా గుర్తింపు తెచ్చుకుంది రిలయన్స్ జియో. దేశ వ్యాప్తంగా బెస్ట్ కవరేజీ ఇస్తూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తోంది. ఆకట్టుకునే రీఛార్జ్ ప్లాన్స్ కూడా పరిచయం చేస్తోంది. తాజాగా చీపెస్ట్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేద, మధ్య తరగతి వినియోగదారులు ఇష్టపడేలా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను రూపొందించింది. అంతేకాదు, తన ప్లాన్స్ అన్నింటిలో అత్యంత చౌకైనదిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ ప్లాన్ మరేదో కాదు రూ.189 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ కేవలం సిమ్ ను యాక్టివ్ గా ఉంచడానికి అవసరమైన ప్రాథమిక ప్రయోజనాలను అందిస్తుంది. డేటా, కాలింగ్, SMS సౌకర్యాల కోసం ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ తో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ.189 ప్లాన్ తో లాభాలు
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 300 SMS, 2GB డేటాతో వస్తుంది. ఈ డేటా ఒకేసారి అందిస్తుంది. రోజువారీ డేటా కాదు. దీనికి JioTV, JioAICloud లాంటి కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ 28 రోజులు. మీ 2GB FUP డేటా అయిపోయినప్పుడు, నెట్ స్పీడ్ వేగం 64Kbpsకి తగ్గుతుంది.
టెలికాం రంగంలోనే చౌకైన ప్లాన్లతో పోటీ
ఈ ప్లాన్ ఇండియన్ టెలికాం రంగంలో చౌకైన ప్లాన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్లాన్ తో జియో సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), వోడాఫోన్ ఐడియా (Vi) లాంటి వంటి ఆపరేటర్లు ఇంకా చౌకైన ప్లాన్ లను అందిస్తున్నాయి. దేశంలోని టెలికాం కంపెనీలు తమ ప్రతి వినియోగదారునికి ఆదాయాన్ని అంటే ARPUని పెంచుకుంటున్నాయి. దీని కారణంగా, టారిఫ్ పెంపులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. నెక్ట్స్ టారిఫ్ పెంపు 2026లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ సారి గతంలో కంటే కొత్త పద్దతిలో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, జియో సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ మంచి ఎంపిక అంటుంది జియో కంపెనీ. చేతిలో డబ్బులు లేకపోయినా, సిమ్ డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవచ్చని సూచిస్తోంది.
Read Also: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?