BigTV English

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Ali Wife: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు అలీ(Ali) ఒకరు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం కమెడియన్ గా వందల సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ కూడా ఆలీ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఒకానొక సమయంలో ఈయన రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం రాజకీయాలకు సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో గడుపుతున్నారు.


క్లాత్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన జుబేదా..

ఇక ఆలీ వైఫ్ జుబేదా(Zubeda) గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. నిత్యం ఎన్నో రకాల కుకింగ్ వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న జుబేదా తాజాగా ఒక కొత్త బిజినెస్ ప్రారంభించారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిన తర్వాత వెంటనే క్లోత్ బిజినెస్ (Clothes Business)లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే జుబేదా సైతం క్లోత్ బిజినెస్ ప్రారంభించారని తెలుస్తుంది.


జుబేదా అలీ కలెక్షన్స్..

జుబేదా అలీ కలెక్షన్స్ (Zubeda Ali Collections)అంటూ ఈమె ఈ బిజినెస్ ప్రారంభించారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ బిజినెస్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోని జుబేదా అలీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ కొత్త బిజినెస్ ప్రారంభమైందని మీ అందరి సపోర్ట్ కచ్చితంగా కావాలని తెలిపారు. అలాగే అలీ జుబేదా కలెక్షన్స్ లో మీరు కొనుగోలు చేస్తే మీకు ఒక లక్కీ కూపన్ లభిస్తుందని, ఈ లక్కీ కూపన్ పొందిన వారికి తను స్వయంగా చేసిన చికెన్ దమ్ బిర్యాని తినే అవకాశం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.

?igsh=MTEzcXB3Y3oycWpyMg%3D%3D

ఈ విధంగా జుబేదా అలీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడంతో పలువురు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు మాత్రం మీలాంటి సెలబ్రిటీలు ఇలా బిజినెస్లను ప్రారంభిస్తే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమెకు కేవలం ఇంస్టాగ్రామ్ లో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని అలీ జుబేదా ఈ బిజినెస్ ప్రారంభించారని తెలుస్తుంది. ఇక అలీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలకు కుమారుడు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన పెద్ద కుమార్తెకు ఎంతో ఘనంగా వివాహం చేశారు. ఇక కెరియర్ పరంగా కూడా ఆలీ ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఇప్పటికి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Also Read: Ranbir Kapoor: రామాయణ కోసం ఆ బయోపిక్ వదులుకున్న రణబీర్.. బయటపెట్టిన డైరెక్టర్!

Tags

Related News

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Tv Kissik Talk Show : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

Big Stories

×