Film Chamber Commerce: తెలుగు సినీ కార్మికులు సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకు రోజుకు ఈ వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో నిర్మాతల మండల సంచనల నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్ లు జరపొద్దని నిర్ణయించింది. అంతేకాదు ఫెడరేషన్ యూనియన్లను 24 క్రాఫ్ట్ విభాగాల యూనియన్లను షూటింగ్ లకుఅనుమతి ఇవ్వోద్దని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 24 విభాగాల ఫెడరేషన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొనసాగుతున్న సమ్మె
కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్.. నిర్మాతల మండలిని డిమాండ్ చేసింది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. ప్రస్తుతం పరిశ్రమ నష్టాల్లో ఉందని, ఈ సమయంలో అడిగినంత వేతనాలు పెంచడం కుదరదని తేల్చాయి. దీంతో ముందస్తు నోటీసులు లేకుండ ఫెడరేషన్ రాత్రికి రాత్రే సమ్మెకు పిలుపు నిచ్చాయి. గత వారం రోజులు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాత సి. కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం, సినీ పెద్దలతో చర్చలు జరుగుతున్నాయి.
నిర్మాతల మండలి సంచలన ప్రకటన
కానీ, ఇవి సఫలం అవ్వడం లేదు. సమ్మెకు తెరపడటం లేదు. దీనికి కారణం యూనియన్ల ఇష్టారీతి నిర్ణయాలు, గొడవలు. ఈ విషయంలో నిర్మాతలు సైతం తగ్గేదే లే అంటున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ కు షాకిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్ లోని అన్ని యూనియన్ల వారితో చర్చలు లేదా సంప్రదింపుల చేయకూడదని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు సూచించారు. ఈ నిబంధన తదుపరి సూచనలు వచ్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ముందస్తు సమాచారం, స్పష్టమైన అనుమతి లేకుండ ఎలాంటి సేవలు అందించకూడదనే ఆదేశాలు జారి చేసింది.
నిర్మాతలకు ఛాంబర్ హెచ్చరిక
దీనిని ప్రతి ఒక్కరు దీనిని సీరియస్ గా తీసుకుని ఫెడరేషన్ ఎలాంటి సంప్రదింపులు చేయకూడదని నిర్మాతల మండలి హెచ్చరించింది. కాగా యూనియన్ల ఇస్టారీతి నిర్ణయాలు, ముందస్తు సమాచారం లేకుండ, ఏకపక్ష నిర్ణయాలతో సమ్మెకు పిలుపు ఇవ్వడంపై నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంతో ఫిల్మ్ ఫెడరేషన్, యూనియన్ నేతలకు గట్టి షాక్ తగిలింది. ఛాంబర్ నిర్ణయంపై ఫెడరేషన్ రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది.
Also Read: Samantha: సమంతనే నాగచైతన్యను వదిలించుకుంది.. అమెదంతా దొంగ ఏడుపు.. సానుభూతి కోసమే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన
కార్మిక యూనియన్లతో చర్చలు, సంప్రదింపులు చేయొద్దని నిర్ణయం
కార్మిక సంఘాలు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చాయన్న TFCC
తదుపరి సూచనలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం
స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు… pic.twitter.com/l5GC6eAfwq
— BIG TV Breaking News (@bigtvtelugu) August 8, 2025