BigTV English

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather News: హైదరాబాద్ లో గత మూడు, నాలుగు రోజుల నుంచి భారీ వర్షం కురిస్తోంది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అవుతున్నాయి. భాగ్యనగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి పలు ఏరియాలు చిత్తడిచిత్తడి అయిపోయాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, యూసఫ్ గూడ, కృష్ణా నగర్, శ్రీనగర్ కాలనీ, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, ప్యాట్నీ ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అమీర్ పేట, వివేకానంద నగర్, హిమాయత్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, బేగంపేట పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వరద నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వరద ముంచెత్తడంతో బైకులు, ఆటోలు, కారులు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే గంట నుంచి 2 గంటల సమయం పట్టింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.


మరో గంటలో భారీ వర్షం..

తాజాగా భాగ్యనగర వాసులను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరో గంట సేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడతాయని వివరించింది. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమైంది.


ఈ 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్…

తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించారు.

పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త..

భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని చెప్పారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ALSO READ: Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×