Vande Bharat Train Tickets Booking: వందేభారత్ ఎక్స్ ప్రెస్.. భారతీయ రైల్వే ప్రయాణీకులకు అత్యాధునిక సదుపాయాలు, అత్యంత వేగవంతమైన ప్రయాణ అనుభాన్ని అందిస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ రైలు టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కల్పించేలా ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్వే స్టేషన్ కు రావడానికి 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. క్యూలైన్ లో నిలబడే అవకాశం లేకుండా ఈజీగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
సౌత్ రైల్వే పరిధిలో మాత్రమే..
దక్షిణ రైల్వే జోన్ పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త సౌకర్యం, అత్యవసర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను పొందే అవకాశం ఉంటుంది. ఇటీవల వరకు, వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు దాని ప్రారంభ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత, రిజర్వేషన్ వ్యవస్థ ఇంటర్మీడియట్ స్టాప్ లలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, అన్ని బుకింగ్ లను బ్లాక్ చేసేది. ఇప్పుడు ఆ విధానాన్ని అధికారులు రద్దు చేశారు. ఇప్పుడు మధ్యలో స్టేషన్లలోనూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మాత్రమే ప్రస్తుతం ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. మరో ఎనిమిది వందే భారత్ రైళ్లలో టెస్టింగ్ చేస్తున్నారు. ప్రయాణీకుల స్పందనను బట్టి మరిన్ని రైళ్లకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వందేభారత్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
వందేభారత్ రైల్లో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు రైలు స్టేషన్ కు రావడానికి 15 నిమిషాల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
⦿ ముందుగా www.irctc.co.in లేదంటే IRCTC రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ ను ఓపెన్ చేయాలి.
⦿ మీ ప్రస్తుత IRCTC ID ని ఉపయోగించి లాగిన్ కావాలి.
⦿ మీ బోర్డింగ్, గమ్యస్థాన స్టేషన్లు, ప్రయాణ తేదీని ఎంచుకోవాలి. వందే భారత్ రైలును సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ రియల్-టైమ్ సీట్ల లభ్యతను తనిఖీ చేయాలి. ఏవైనా సీట్లు అందుబాటులో ఉన్నాయో? లేదో? సిస్టమ్ చూపుతుంది. ఉండే ప్రొసీడ్ కావాలి.
⦿ ఎగ్జిక్యూటివ్ క్లాస్, చైర్ కార్ లో ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
⦿ ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించాలి. మీ ధృవీకరించబడిన ఇ-టికెట్ SMS, WhatsApp, ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది.
ఈ 8 రైళ్లలోనే టికెట్ బుకింగ్ అవకాశం
ప్రస్తుతం 8 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలోనే 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. ఇంతకీ ఆ రైళ్లు ఏవంటే…
⦿ 20631 మంగళూరు సెంట్రల్ – తిరువనంతపురం సెంట్రల్
⦿ 20632 తిరువనంతపురం సెంట్రల్ – మంగళూరు సెంట్రల్
⦿ 20627 చెన్నై ఎగ్మోర్ – నాగర్‌కోయిల్
⦿ 20628 నాగర్‌కోయిల్ – చెన్నై ఎగ్మోర్
⦿ 20642 కోయంబత్తూర్ – బెంగళూరు కాంట్.
⦿ 20646 మంగళూరు సెంట్రల్ – మడ్గావ్
⦿ 20671 మధురై – బెంగళూరు కాంట్.
⦿ 20677 Dr MGR చెన్నై సెంట్రల్ – విజయవాడ
Read Also: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!