అరేబియా కడలి మూవీ నటీనటులు:
సత్యదేవ్, ఆనంది, రవివర్మ, నాజర్, రఘుబాబు, అమిత్ తివారీ, పూనమ్ బజ్వా, దలీప్ తాహిల్, అలోక్ జైన్, ప్రత్యూష తదితరులు
సాంకేతిక బృందం..
దర్శకత్వం : వీవీ సూర్య కుమార్
క్రియేటివ్ డైరెక్టర్ : క్రిష్ జాగర్లమూడి
సినిమాటోగ్రాఫర్ : సమీర్ రెడ్డి
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు
ఓటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్ : 08 – 08 -2025
ప్రముఖ యంగ్ హీరో సత్యదేవ్ (Sathyadev) ఈ మధ్యకాలంలో భారీ పాపులారిటీ అందుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతి సిరీస్, సినిమాతో ప్రతిభ చాటుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన తాజా వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’. ట్రైలర్ విడుదలైనప్పుడే నాగచైతన్య(Naga Chaitanya) ‘తండేల్’ మూవీ తో ఎన్నో కంపారిజన్స్ వచ్చాయి. మరి అలాంటి సీరీస్ ఇప్పుడు ఎలా ఉంది? దర్శకుడు వివి సూర్య కుమార్ ఈ సీరీస్ లో ఏం చూపించారు? అనేది తెలియాలి అంటే సీరీస్ చూడాల్సిందే. ఆనంది (Anandi) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ:
కథ విషయానికి వస్తే.. విశాఖలోని భీమిలి పట్నంలో మత్స్యవాడ, చేపలవాడ అనే గ్రామాల ప్రజల మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉంటాయి. తీర ప్రాంత గ్రామాలైనప్పటికీ.. జెట్టీలు,చేపల వేటకు సరైన సదుపాయాలు కూడా ఉండవు. తిండి కోసం అలాగే అప్పులు తీర్చడానికి డబ్బు కావాలి.. ఆ డబ్బు కోసమే గుజరాత్ వలస వెళ్లి అక్కడ చేపలను వేటాడటం వృత్తిగా కొనసాగిస్తూ ఉంటారు. గుజరాత్ వలస వెళ్లడానికి ముందు పొరుగూరి అబ్బాయి బదిరి (సత్యదేవ్)తో తన కుమార్తె గంగ (ఆనంది) ప్రేమలో ఉంది అనే విషయం నానాజీ (కోట జయరాం)కి తెలుస్తుంది. చిన్నపాటి గొడవ కూడా అవుతుంది. ట్రైన్ లోనే ఇద్దరు గొడవపడడంతో పోలీసులు వారిని కిందకి దింపేస్తారు. అక్కడి నుండి వీళ్ళు గుజరాత్ ఎలా వెళ్లారు ? చేపలు వేటకు వెళ్లిన వాళ్ళు పాకిస్తాన్ జలాల్లో చిక్కుకుంటారు? అలా ఎలా చిక్కుకుంటారు? వాళ్లను ఇండియాకు తీసుకురావడానికి ఎవరు, ఎటువంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైంది ? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఇక ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఈ సీరీస్ చూస్తున్నంత సేపు మనకు నాగచైతన్య తండేల్ మూవీ కళ్ళ ముందు మెదులుతుంది. రెండింటిలో కూడా సేమ్ పాయింట్. రెండు కథలు, సన్నివేశాల మధ్య అంత తేడా కూడా ఉండదు. అందుకే అటు తండేల్ సినిమాను ఇటు అరేబియా కడలి సీరీస్ ని కంపేర్ చేయకుండా ఉండలేం. వాస్తవానికి ఈ సిరీస్ ను తండేల్ సినిమా అప్పుడే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ రెండింటిలోనూ ఒకటే స్టోరీ కావడం.. పైగా ఆ మూవీ మొదట రావడంతో కొద్దిరోజులు ఈ సీరీస్ ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు స్టోరీలో కొంచెం మార్పులు చేసి రిలీజ్ చేశారు. కథలో కొత్తదనం ఏమీ లేదు. తండేల్ మూవీలో రెండు దేశాల మధ్య వైరం ఉన్నట్టు చూపిస్తే.. ఇక్కడ దేశాలతో పాటు రెండు గ్రామాల మధ్య కూడా వైరం ఉన్నట్లు చూపించారు.. కథనం కూడా స్లోగా ఉండడం ఈ సీరీస్ కి మైనస్ గా మారింది. ఇక డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కథలో చేసిన మార్పులు కొంతవరకు పర్లేదు అనిపించాయని చెప్పవచ్చు.
నటీనటుల పర్ఫామెన్స్..
సత్యదేవ్ నటన బాగుంది. విశాఖ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ యాసను ఈయన బాగా పట్టుకున్నారు. కథా నేపథ్యం ప్రేక్షకులకు చేరువ కావడంలో కూడా ఈ యాస బాగా వర్కౌట్ అయ్యింది. గంగా పాత్రలో ఆనంది కూడా ఒదిగిపోయింది. కోర్ట్ మూవీ హీరో హర్ష్ రోషన్, వంశీకృష్ణ నాజర్ ఇలా ఎవరికి వారు తమ పాత్రల పరిధి మేరకు చేసి మెప్పించారు.
మొత్తంగా కమర్షియాల్టీకి దూరంగా.. రియాల్టీకి దగ్గరగా తీసిన వెబ్ సిరీస్ అరేబియా కడలి. కథలో కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్ప ఏమి మిగలదు. తండేల్ కి మరో వెర్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ నటుడిగా సత్యదేవ్ బెస్ట్ అనిపించారు. మనసుకు కదిలించే సన్నివేశాలు కూడా ఈ సిరీస్ లో ఉన్నాయి. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి ఎటువంటి బోర్ లేకుండా చూడవచ్చని చూసిన ఆడియన్స్ కూడా చెబుతున్నారు. మొత్తానికి అయితే ఈ సీరీస్ తండేల్ మూవీకి తక్కువే అని చెప్పవచ్చు.
Arebia Kadali Rating : 1.75/5
ALSO READ:Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ లాక్.. త్వరలో అఫీషియల్ ప్రకటన!