VP Venkitesh: ఇటీవల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లలో నటుడు వెంకటేష్ (Venkitesh). ఇటీవల గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా (King Dom)ద్వారా ఈయన విలన్ మురుగన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇతని పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇక కింగ్డమ్ సినిమా మంచి విజయం అందుకోవడంతో వెంకటేష్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన విషయాలతో పాటు తన కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
టీవీ సీరియల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు…
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన తల్లి గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నటుడు వెంకటేష్ మలయాళ ఇండస్ట్రీకి చెందినవారు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వెల్లడించారు.అయితే మొదట్లో టీవీ సీరియల్స్ లో నటించానని ఆ తర్వాత సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకున్నానని తెలిపారు. ఇలా ఒక రెండు మూడు సీరియల్స్ తో పాటు ఐదు ఆరు సినిమాలు కూడా చేశానని వెల్లడించారు. ఇక కింగ్డమ్ సినిమా తనుకు చాలా మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని, ఎలాంటి ఆడిషన్స్ లేకుండా గౌతమ్ తిన్ననూరి గారు తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు.
నాన్న మరణంతో డిప్రెషన్ లోకి ….
ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన తండ్రి మరణం(Father Death) గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. గత మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోయినప్పుడు తాను పూర్తిగా డిప్రెషన్(Depression) లోకి వెళ్లిపోయానని తెలిపారు. అయితే మా అమ్మ మాత్రం చాలా ధైర్యంగా ఉండేదని నన్ను ఆ డిప్రెషన్ నుంచి అమ్మ బయటకు తీసుకు వచ్చిందని తెలిపారు. అమ్మ కేజిఎఫ్ లేడీ అంటూ ఈ సందర్భంగా తన తల్లి తనకిచ్చిన మద్దతు గురించి తెలిపారు. ఇక నాన్న ఉన్న సమయంలో కూడా అమ్మ అన్ని పనులు తానే చూసుకుంటూ ఉండేదని తెలిపారు.
అదే నా డ్రీమ్…
ఇక ఈ సినిమా గురించి అమ్మకు చెప్పగానే చాలా సంతోషించిందని ఇక ఈ సినిమా చూసి అమ్మ నన్ను ఎంతగానో మెచ్చుకుందని వెంకటేష్ వెల్లడించారు. ఇక చాలా రోజుల నుంచి అమ్మకు తాను ఒక మంచి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను త్వరలోనే అది కూడా నెరవేరబోతుందని తెలిపారు. అమ్మకు మంచి ఇల్లు కానుకగా ఇవ్వడమే తన డ్రీమ్ అని తెలిపారు. మరొక నెల రోజులలో నా కల కూడా పూర్తి కాబోతుంది అంటూ వెంకటేష్ ఈ సందర్భంగా తన తల్లి గురించి, తన కుటుంబంలో తన తల్లి పాత్ర గురించి కూడా తెలిపారు. ఇక ఈయన మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం ఇడ్లీలు అమ్ముతూ జీవనం గడిపేవారనే సంగతి తెలిసిందే. ఇక సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న ఈయనకు కింగ్డమ్ సినిమా మాత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాతో వెంకటేష్ కు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.
Also Read: Thamma Reddy: నా దృష్టిలో చిరంజీవి, బాలయ్యను కలవటం తప్పు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!