జ్యోతిషశాస్త్రంలో రాశులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ కూడా పెళ్లి చేసే ముందు వధూవరుల రాశులను తెలుసుకొని దాన్నిబట్టి వారి జ్యోతిష్యాన్ని చూస్తారు. వారికి వివాహం చేయవచ్చో లేదో తెలుసుకుంటారు. ఒకరి రాశి అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనావేసి చెబుతుంది. వారు ఎలాంటి వారు కూడా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేయగలరు. అలా పెళ్లిళ్లలో రాశులను బట్టి వివాహం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. 12 రాశులలో అన్ని రాశుల వారు కలిసి జీవించలేరు. ఒక రాశి వారికి మరొక రాశి వారితో పడకపోవచ్చు. అలాంటి వారు పెళ్లి చేసుకుంటే వారి వివాహం నిలబడదు. కాబట్టి ఏ రెండు రాశులు పెళ్లి చేసుకుంటే వివాహం ఎక్కువ కాలం నిలబడదో తెలుసుకోండి.
మేషం – కర్కాటకం
మేషం అగ్నిరాశి. కర్కాటకం నీటి రాశి. కాబట్టి ఈ రెండు రాశుల వారికి సరిగా పొదగకపోవచ్చు. నీరు, అగ్ని అనేవి రెండు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చురుగ్గా ఉంటారు. వారికి కపటం తెలియదు. అయితే కర్కాటక రాశి వారి భావాలను మేష రాశి వారు తరచూ చులకన చేసే అవకాశం ఉంది. వారి మధ్య అపార్ధాలకు కూడా కారణం అవుతుంది. కాబట్టి మేషరాశి వారు, కర్కాటక రాశి వారు వివాహం చేసుకోవడం మంచిది కాదు.
మీనం – ధనస్సు
మీనరాశి నీటి రాశి. ధనస్సు అగ్నిరాశి. ఈ రాశిల్లో జన్మించిన వ్యక్తులు వారి వ్యక్తిత్వాలు, స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారు బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. చురుగ్గా ఉంటారు. కానీ మీన రాశి వారు భావోద్వేగ పరంగా చాలా సున్నితంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు బహిరంగ మాట్లాడే స్వభావం… మీన రాశి వారిని బాధపెడుతుంది. కాబట్టి భార్యాభర్తలు మీనం, ధనుస్సు రాశి వారికి చెందిన వారైతే వారి వివాహం ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు.
మిధునం – వృశ్చికం
మిధున రాశి వారు ఉల్లాసభరితంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటారు. వృశ్చిక రాశి వారు తమ భాగస్వాములను తమ సాధీనంలోనే ఉంచుకోవాలని అనుకుంటారు. కానీ మిధున రాశి వారికి స్వాతంత్య్రం కావాలి. మిధున రాశి వారు వృశ్చిక రాశి వారి మధ్య సంబంధం ఏర్పడడం చాలా కష్టం. ఈ ఇద్దరు వివాహం చేసుకుంటే ఆ వివాహం విజయవంతం అవ్వడానికి చాలా ఓపిక, సహనం అవసరం ఉంటాయి.
మకరం – సింహరాశి
మకర రాశి వారు భూమికి చెందినవారు. సింహరాశి అగ్నికి చెందిన రాశి. మకర రాశి వారు కష్టపడి పని చేసి క్రమశిక్షణతో ఉంటారు. అలాగే సంయమనంగా ఉంటారు. కానీ సింహరాశి వారు గట్టిగా మాట్లాడతారు. గర్వంతో నిండి ఉంటారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. వీరిద్దరి వ్యక్తిత్వాలు విరుద్ధంగా ఉంటాయి. సింహరాశి, మకర రాశి ఇద్దరూ కలిసి జీవించడం కాస్త కష్టంగానే ఉంటుంది.
వృషభం – కుంభం
వృషభ రాశి, కుంభరాశికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారి జీవితం కష్టాలమయంగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు సౌకర్యంగా, స్థిరంగా ఉండేందుకు ఇష్టపడతారు. కానీ కుంభ రాశి వారు తరచూ మార్పులను ఇష్టపడతారు. గందరగోళంగా జీవిస్తారు. అయితే కుంభరాశి వారు సృజనాత్మకంగా ఉండి స్వేచ్ఛను కోరుకుంటారు. వృషభ రాశి వారు కుంభ రాశి వారిని నమ్మకూడదని అనుకుంటారు. కాబట్టి వీరిద్దరూ కలిసి జీవిస్తే వారి మధ్య అనుబంధం చాలా బలహీనంగా ఉంటుంది.
Also Read: ఈ పాత వస్తువులు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉంచకండి.. ఆ బాధ తట్టుకోలేరు!