BigTV English

Mohan Lal: అబ్బే అస్సల్ సెట్ అవ్వలేదు… చిరు గాడ్ ఫాదర్‌పై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్..!

Mohan Lal: అబ్బే అస్సల్ సెట్ అవ్వలేదు… చిరు గాడ్ ఫాదర్‌పై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్..!

Mohan Lal: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో భారీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు దాటినా ఇంకా అదే జోష్ తో క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘లూసిఫర్’ రీమేక్ ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర బృందం. అందులో భాగంగానే మోహన్ లాల్ కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఊహించని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే చిరంజీవి(Chiranjeevi ) ‘గాడ్ ఫాదర్’ మూవీ పై మోహన్ లాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.


రీమేక్ చేసి నిరాశ పడ్డ చిరంజీవి..

అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. అందులో ఒకటి ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా మోహన్ లాల్ మలయాళం లో తెరకెక్కించిన ‘లూసీఫర్’ చిత్రానికి రీమేక్. లూసిఫర్ సినిమా మలయాళం సినీ ఇండస్ట్రీ మార్కెట్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తే.. గాడ్ ఫాదర్ మాత్రం యావరేజ్ గానే నిలిచింది. ఫస్ట్ ఆఫ్ మాత్రం అద్భుతంగా ఉన్నా.. సెకండ్ హాఫ్ లో చాలా మార్పులు చేయడం వల్లే చెడగొట్టేశారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అంతేకాదు అటు ఓటీటీలో కూడా పెద్దగా రెస్పాన్స్ లభించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మలయాళంలో ‘లూసీఫర్’ సీక్వెల్ త్వరగా ఎక్కుతున్న నేపథ్యంలో దీనికి కూడా సీక్వెల్ చేస్తారా? అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండగా.. లూసీఫర్ 2 ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ లాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


Manchu Viranika Reddy: మంచు ఫ్యామిలీ గొడవలపై తొలిసారి స్పందించిన పెద్ద కోడలు..!

చిరంజీవికి సెట్ అవ్వలేదు – మోహన్ లాల్..

ఇకపోతే ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా.. ఒక విలేఖరి చిరంజీవి లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఇప్పుడు లూసీఫర్ సీక్వెల్ కూడా వస్తోంది. ఈ సినిమా ని కూడా ఆయన రీమేక్ చేసేందుకు అనువుగా ఉంటుందా? అని ప్రశ్నించగా దానికి మోహన్ లాల్ మాట్లాడుతూ.. “చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రాన్ని నేను కూడా చూశాను. బాగానే ఉంది. కానీ మా లూసీఫర్లో ఉన్న క్యారెక్టర్ ని చాలా వరకు మార్చేశారు. కాబట్టి ఈ సీక్వెల్ చిరంజీవికి ఉపయోగపడకపోవచ్చు.. ఒకరకంగా చిరంజీవికి ఈ సినిమా సూట్ అవ్వదు” అంటూ ఓపెన్గానే కామెంట్ చేశారు. ఇక ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ అప్పుడే బుకింగ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా వచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఏ సినిమా అయినా సరే మలయాళం లో విడుదలయితే మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం చాలా కష్టం. అలాంటిది విడుదలకు రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆ మార్క్ అందుకుందంటే.. కచ్చితంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి మలయాళ ఇండస్ట్రీని ఏ సినిమా ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×