BigTV English

Robinhood: రాబిన్ హుడ్ హానెస్ట్ పాడ్ కాస్ట్… మరి వెన్నల కిషోర్ హానెస్ట్‌గా ఆన్సర్ ఇచ్చాడా.?

Robinhood: రాబిన్ హుడ్ హానెస్ట్ పాడ్ కాస్ట్… మరి వెన్నల కిషోర్ హానెస్ట్‌గా ఆన్సర్ ఇచ్చాడా.?

Robinhood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ (Nithin).. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘భీష్మ’ కాంబో ని రిపీట్ చేస్తున్నారు.వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ సినిమా నితిన్ కెరియర్ కు మంచి పునాది వేసింది. ఇక తర్వాత అదే తరహాలో సినిమాలు చేస్తారని, సక్సెస్ అందుకుంటారని అందరూ అనుకోగా.. ఆ రేంజ్ లో నితిన్ కి సక్సెస్ లభించలేదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్ ‘సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. మరొక హీరోయిన్ కేతికా శర్మ (Kethika Sharma) స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది.


పాడ్ కాస్ట్ నిర్వహించిన రాబిన్ హుడ్ టీం..

రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిషోర్(Vennela Kishore) తో పాటు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇకపోతే మార్చి 28వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా పెంచారు చిత్ర బృందం. అందులో భాగంగానే తాజాగా ప్రమోషన్స్ పేరిట పాడ్ కాస్ట్ నిర్వహించారు. ఈ పాడ్ కాస్టులో నితిన్ తో పాటు వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు.


Robin hood:అది దా సర్ప్రైజ్ హుక్ స్టెప్‌పై సెన్సార్ రియాక్షన్… శేఖర్ మాస్టర్ కష్టం వృథా..?

నితిన్ ప్రశ్నలకు వెన్నెల కిషోర్ హానెస్ట్ సమాధానం ఇచ్చారా..?

ఇకపోతే ఈ పాడ్ కాస్ట్ విషయానికి వస్తే.. పూర్తి కామెడీ తో పాడుకాస్ట్ ఇంటర్వ్యూ కొనసాగించారని చెప్పవచ్చు. ఇక ఇందులో భాగంగా నితిన్ అడిగే ప్రశ్నలకు వెన్నెల కిషోర్ హానెస్ట్ గా సమాధానాలు చెప్పారా అనే విషయం తెలియాలి అంటే ఈ పాడ్ కాస్ట్ చూడాల్సిందే.ఈ పాడ్ కాస్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ? అని నితిన్ ను వెన్నెల కిషోర్ అడగ్గా..” నాకు ఎందుకు వచ్చింది కాదు.. నీకెందుకు రాలేదు.. అని సిగ్గుపడు” అంటూ సరదాగా కామెంట్ చేశారు నితిన్. ఇక ఇదే డైలాగ్ గతంలో వెన్నెల కిషోర్ చెప్పగా.. ఆ క్లిప్పు కూడా వేసి చూపించడం జరిగింది. ఇక ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ కి కమెడియన్స్ ఎందుకు రారు ? అని ప్రశ్నించగా.. కమెడియన్స్ ఒక నెలకి ఆరు సినిమాలు చేస్తారు. కానీ హీరో ఆరు నెలలకి ఒక సినిమానే చేస్తారు. మరి ప్రమోషన్స్ చేయాలా లేక సినిమా షూటింగ్స్ చేయాలా అని తిరిగి ప్రశ్నించారు వెన్నెల కిషోర్. దీనికి నితిన్ మాట్లాడుతూ.. పేమెంట్ ఇస్తే వస్తారా అని అడగ్గా.. డబ్బుతో మమ్మల్ని కొనలేరు అంటూ మళ్ళీ జలక్ ఇచ్చాడు వెన్నెల కిషోర్ . మరి ఏ చిత్ర ప్రమోషన్ కి రాని మీరు.. ఈ రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ కి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే.. నిర్మాత చెక్ ఇచ్చారు అంటూ షాక్ ఇచ్చారు. ఇక అంతే కాదు మీకు స్టార్ హీరోలకి ఉన్న ట్యాగులు లాగా మీకు కూడా ఫలానా స్టార్ అంటూ కమెడియన్స్ కి కూడా ట్యాగ్ ఇస్తే.. మీరే ట్యాగ్ ఉపయోగిస్తారు అని అడగగా.. నాకు ఎలాంటి ట్యాగ్ వద్దు అంటూ కామెంట్ చేశారు వెన్నెల కిషోర్. మొత్తానికి అయితే నితిన్ అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా వెన్నెల కిషోర్ హానెస్ట్ గానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోందిఇక చివర్లో ఈ పాడ్ కాస్ట్ ఎంత కామెడీ అయితే ఉందో అంతే కామెడీగా సినిమా ఉంటుందని చెప్పారు. ఇక మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, కచ్చితంగా సినిమా అందరూ చూడాలని కూడా పిలుపునిచ్చారు.

Related News

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Big Stories

×