Thamma Reddy: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కార్మికులు నిరసనలు (Cini Workers Strike)చేపడుతున్న నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ (Film Fedaration)అలాగే ఛాంబర్ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నిర్మాతలు ఇప్పటికే ఈ స్ట్రైక్ గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bhardwaj) బిగ్ టీవీతో మాట్లాడుతూ ఈ సమస్యపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ… ప్రస్తుతం స్ట్రైక్ జరుగుతుంది అంటే ఫెడరేషన్, నిర్మాతలు ఇరువైపుల నుంచి తప్పులు ఉన్నాయని తెలిపారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలి..
సాఫ్ట్ వేర్ స్థాయిలో సినీ కార్మికులకు జీతాలు ఇస్తున్నామని చెబుతున్న వాళ్లు కచ్చితంగా వాటికి ఆధారాలతో సహా లెక్కలు చెప్పాలి అంటూ ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. నిర్మాతలు కార్మికులకు నెలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారా? లేదా రోజు వారి వేతనాలు ఇస్తున్నారా? అనే విషయాలపై కూడా స్పష్టత ఇవ్వాలని తెలిపారు. సినీ కార్మికులు స్ట్రైక్ చేయడం ఇది మొదటిసారి కాదని గతంలో కూడా చాలా సందర్భాలలో ఇలాంటి స్ట్రైక్ జరిగాయని తెలిపారు. గతంలో 50 రోజులు పాటు షూటింగ్ ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అంతవరకు వెళ్లకుండా వెంటనే పరిష్కారం చేసుకోవాలని సూచనలు చేశారు.
హీరోల రెమ్యూనరేషన్ ప్రశ్నించే హక్కు లేదు…
ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమా కోసం నిర్మాతలు పెడుతున్న డబ్బు చాలా తక్కువ కానీ, అదనపు ఖర్చుల కోసమే ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలియజేశారు. ఒకప్పుడు సినిమాని నిర్మాతలు ఫ్యాషన్ గా చేసేవారు కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందని తమ్మారెడ్డి వెల్లడించారు. ఒక సినిమా కోసం హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని తెలియజేశారు. పెద్ద హీరోలు లేకపోతే సినిమాలు ఆడవని ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుందని చెప్పే మాటలు పూర్తిగా ఆ వాస్తవమని అందులో నిజం లేదని ఈయన వెల్లడించారు.
ప్రభుత్వాలు ఎందుకు స్పందించాలి?
హీరోలు లేకుండా, ఇటీవల కాలంలో యానిమేటెడ్ సినిమాలు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నాయని గుర్తు చేశారు. నిర్మాతలు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం లేదు అంటూ ఒక కొత్త వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. మరి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు రాకపోతే హీరోలు కూడా థియేటర్లు ఎందుకు కడుతున్నారని ఈయన ప్రశ్నించారు. నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సిన సినిమాలను సంవత్సరాల పాటు తీయడం వల్లే అధిక ఖర్చులు అవుతున్నాయి అలాగే సినిమా కోసం బయట నుంచి వస్తున్న కార్మికులను ఫెడరేషన్ అడ్డుకోవడం పూర్తిగా తప్పని తెలియజేశారు. సాధారణంగా ఇలాంటి సమస్యలను చాంబర్ 5 నెలలలోనే పరిష్కరించాలి కాని అలా చేయలేకపోయింది. అంతేకాకుండా ఈ సమస్య గురించి చాంబర్ లో చర్చించకుండా నిర్మాతలు అందరూ చిరంజీవి(Chiranjeevi) బాలకృష్ణ(Balakrishna)ను కలవడం నా దృష్టిలో పెద్ద తప్పు అని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్య గురించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ తమ్మారెడ్డి తన అభిప్రాయాలను తెలియజేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!