BigTV English

Movies : ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే మూవీస్ ఏంటంటే..?

Movies : ఈ వారం థియేటర్లలో  విడుదలయ్యే మూవీస్ ఏంటంటే..?

Movies releases this week(Today’s entertainment news): జూన్ చివరి వారంలో ఆసక్తికర చిత్రాలు థియేటర్‌లో సందడి చేయబోతున్నాయి. ఓటీటీల్లోనూ న్యూమూవీస్, వెబ్‌సిరీస్‌లు అలరించనున్నాయి. నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం స్పై. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాకు డైరెక్టర్. ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్. స్వతంత్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన మిస్టరీ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. స్పై జూన్‌ 29న నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.


శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా సామజవరగమన. ఈ చిత్రాన్ని రామ్‌ అబ్బరాజు తెరకెక్కించాడు. రెబా మోనికా జాన్‌ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్‌ 29న విడుదలకానుంది. ఈ ప్రేమకథ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు గోపీ సుందర్‌ మ్యూజిక్ అందించాడు.

యాక్షన్‌, అడ్వెంచర్‌ సినిమాలను ఇష్టపడేవారిని ఇండియానా జోన్స్‌ మూవీస్ ఎంతో అలరించాయి. ఇప్పుడు ఇండియాన జోన్స్‌ సిరీస్‌లో 14 ఏళ్ల తర్వాత మరో సినిమా వస్తోంది. ఈ జానర్‌లో వస్తున్న ఆ సినిమా ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ. ఇండియానా జోన్స్‌గా హారిసన్‌ ఫోర్డ్‌ మరోసారి ఆకట్టుకోనున్నారు. జూన్‌ 29న భారతీయ భాషల్ల ప్రేక్షకుల ముందుకురాబోతోంది.


భిన్నమైన మనస్తత్వాలున్న ఓ జంట ప్రేమకథగా వస్తున్న మూవీ లవ్‌ యూ రామ్‌. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధనన్‌ హీరోహీరోయిన్లగా నటించారు. డి.వి.చౌదరి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కె.దశరథ్‌తో కలిసి ఆయన ఈ మూవీని నిర్మించారు. జూన్‌ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మాయా పేటిక . రమేశ్‌ రాపార్తి ఈ చిత్రానికి డైరెక్టర్. జూన్‌ 30న మాయాపేటిక థియేటర్లలో సందడి చేయబోతోంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్/వెబ్‌సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..
టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ 4)- జూన్‌ 25
లస్ట్‌ స్టోరీస్‌ 2 (హిందీ)- జూన్‌ 29
సీయూ ఇన్‌మై నైన్టీన్త్‌ లైఫ్‌ (కొరియన్‌ సిరీస్‌)- జూన్‌ 29
అఫ్వా (హిందీ)- జూన్‌30
సెలెబ్రిటీ (కొరియన్‌ సిరీస్‌)- జూన్‌ 30

డిస్నీ+హాట్‌స్టార్‌..
వీకెండ్‌ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 28
ది నైట్‌ మేనేజర్‌ (సిరీస్‌2)- జూన్‌30

అమెజాన్‌ ప్రైమ్‌..
జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌ 4) -జూన్‌ 30

ఆహా..
అర్థమైందా అరుణ్‌కుమార్‌ (తెలుగు సిరీస్‌)- జూన్‌ 30

జియో సినిమా..
సార్జెంట్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 30

బుక్‌ మై షో..
ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 29

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×