E-Paper
Advertisement

Mr Bachchan : మిస్టర్ బచ్చన్ గా మాస్ మహారాజ్.. ఏంది సామీ ఈ మాస్ ర్యాగింగ్..

Mr Bachchan : మిస్టర్ బచ్చన్ గా మాస్ మహారాజ్.. ఏంది సామీ ఈ మాస్ ర్యాగింగ్..
Advertisement
Mr Bachchan


Mr Bachchan : మాస్ మహారాజ్ గత కొద్దిరోజులుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ధమాకా ,వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ అందించినా ..ఆ తర్వాత వచ్చిన రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో రవితేజ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మాస్ మహారాజ్ నెక్స్ట్ మూవీకి మిస్టర్ బచ్చన్ అనే ఒక మంచి మాస్ టచ్ తో ఉన్న పవర్ ఫుల్ టైటిల్ ను సెలెక్ట్ చేశారు.

‘నామ్ తో సునా హోగా’ అనే టాగ్ లైన్ తో విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మిరపకాయ డైరెక్టర్ హరీష్ శంకర్ తో రవితేజ చేస్తున్న ఈ మూవీ .. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్య‌శ్రీ బోర్స్ నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఒక పాతకాలం స్కూటర్ పై ఎంతో స్టైల్ గా పోజిస్తూ కూర్చున్న రవితేజ ఫోటోని ఈ పోస్టర్లో జోడించారు.

Advertisement

కళ్ళకి షేడ్స్ ధరించి క్లాస్ గెటప్ లో మాస్ మహారాజ్.. చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఇక పోస్టర్ వెనుక బ్యాక్ డ్రాప్ లో ఐకానిక్ నటరాజ్ థియేటర్ ఉంది. ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టుగా.. ఇందులో రవితేజ అమితాబచ్చన్ పోలికలతో కనిపిస్తున్నాడు. ఇక మాస్ మహారాజ్ ఇన్ అండ్ యాజ్ అని పోస్టర్లో మెన్షన్ చేశారు దీన్ని బట్టి అమితాపాత్రలో రవితేజ నటిస్తున్నాడు అని అనుకోవాలి. ఇక మాస్ మహారాజ్ ఈ కొత్త లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతానికి పోస్టర్ మూవీ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ మూవీ అయినా రవితేజ ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ అతనికి అందిస్తుందని ఆశిద్దాం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×