BigTV English

Mrunal Thakur: గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసిన మృణాల్ ఠాకూర్‌.. సోష‌ల్ మీడియా షేక్‌

Mrunal Thakur: గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసిన మృణాల్ ఠాకూర్‌.. సోష‌ల్ మీడియా షేక్‌

Mrunal Thakur: బెంగాలీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సినీ రంగంలోకి అడుగు పెట్టే ముందే సీరియ‌ల్స్‌లో న‌టించి మెప్పించింది. త‌ర్వాత హిందీలోకి అడుగు పెట్టి స‌క్సెస్ అందుకున్న ఆమె.. తెలుగులోకి సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యిందో మ‌న‌కు తెలిసిదే. ఈ సినిమాలో సీత‌గా ఆమె న‌ట‌న‌, లుక్స్ చూసి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. అందం, అభిన‌యంతో మృణాల్ ఆడియెన్స్ హృద‌యాల‌ను చోటు ద‌క్కించుకుంది. ఇప్పుడామె సౌత్‌లో వ‌రుస సినిమాలో బిజీ అయ్యేలా అడుగులు వేస్తుంది.


సీతారామం చిత్రంలో పద్ధతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడిప్పుడే త‌న‌లోని మ‌రో కోణమైన గ్లామ‌ర్‌ను ఎలివేట్ చేస్తుంది. రీసెంట్‌గా సెల్ఫీ అనే బాలీవుడ్ చిత్రంలో అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి ఆడి పాడింది మృణాల్. అందులో ఆమె అందాల‌ను చూపించిన తీరు చూసి అబ్బో అని అనుకున్నారు. ఆ హీట్ త‌గ్గ‌క ముందే మృణాల్ మ‌రోసారి ఆడియెన్స్‌కి గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ వేసుకున్న ఫొటోల‌ను షేర్ చేసింది మృణాల్‌. ఆమె అంద‌చందాలు చూసిన నెటిజ‌న్స్ కొంద‌రు అబ్బా ఏమందం అని అనుకుంటుంటే.. కొంద‌రు మాత్రం ఈమె మాత్రం మేం చూసిన సీత కాద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ బెంగాలీ బ్యూటీ మాత్రం బికినీ ట్రీట్‌తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఆమె ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని 30లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అలాగే సూర్య 42 సినిమాలోనూ న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇవి కాకుండా గుమ్ ర‌హ్‌, పూజా మేరీ జాన్‌, పిప్పా, ఆంఖ్ మిచోలి వంటి బాలీవుడ్ సినిమాల్లో మృణాల్ న‌టిస్తోంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×