E-Paper
Advertisement

Mrunal Thakur : మృణాల్ తో దేవరకొండ ప్లేస్ లో నెటిజన్… దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన హీరోయిన్

Mrunal Thakur : మృణాల్ తో దేవరకొండ ప్లేస్ లో నెటిజన్… దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన హీరోయిన్
Advertisement

Mrunal Thakur :  సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లపై ట్రోలింగ్ అనేది సర్వసాధారణంగా మారింది. మామూలుగానే తమ అభిమాన హీరో గాని, హీరోయిన్ గాని కనిపిస్తే వెంటనే వాళ్ళతో కలిసి వీలైతే ఒక్క సెల్ఫీ తీసుకోవాలని హడావిడి చేస్తూ వుంటారు   అభిమానులు. కానీ కొన్నిసార్లు ఆ అభిమానం హద్దులు దాటి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే వరకు వెళ్తుంది. తాజాగా ఇలాగే తనను ఇబ్బంది పెట్టే విధంగా ఓ నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోపై సీరియస్ అయింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).

అసలేం జరిగిందంటే… దీపావళి సందర్భంగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన “ది ఫ్యామిలీ స్టార్” (The Famiy Star) మూవీ పోస్టర్ ను ఎడిట్ చేశాడు. ఊరికే ఇది చేస్తే పర్లేదు కానీ అందులో విజయ్ దేవరకొండ ప్లేసులో తన మొహాన్ని రీప్లేస్ చేసి, అతను మృణాల్ ఠాకూర్ తో సన్నిహితంగా ఉండి దీపాలు వెలిగించినట్టుగా ఉంది ఆ ఫోటో. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫోటోకి ‘దీపావళి ఫోటో ఎడిటింగ్.. బాలీవుడ్ నటి ఫోటోషూట్’ అని రాసుకొచ్చాడు.

Advertisement

అయితే అది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కి కనపడడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. వెంటనే సదరు నెటిజన్ పోస్ట్ కు రిప్లై ఇస్తూ మండిపడింది. “బ్రదర్… మీకు మీరే ఎందుకు ఇలా తప్పుడు భరోసా ఇస్తున్నారు? మీరు చేసిన పని బాగుందని అనిపిస్తోందా? ఇది కరెక్ట్ కాదు” అంటూ మృణాల్ ఠాకూర్ అసహనాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా సదరు వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ కావడంతో దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ అభిమానులు అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆ వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.

డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా గోవర్ధన్ అనే పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. అలాగే ఈ సినిమాలో ఇందు అనే ధనవంతుల ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా మృణాల్ (Mrunal Thakur) కనిపించింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ఈ అమ్మడు ‘సన్ ఆఫ్ సర్దార్ 2, హై జవాని తో ఇష్క్ హో నా హై, పూజ మేరీ జాన్, తుం హి హో’ అనే సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ప్రభాస్ సరసన హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ గా చేయబోతోంది అనే రూమర్లు కూడా ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×