E-Paper
Advertisement

Kalki Movie Music Director: నేడే ప్రభాస్ ‘కల్కి’ సినిమా విడుదల.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్..!

Kalki Movie Music Director: నేడే ప్రభాస్ ‘కల్కి’ సినిమా విడుదల.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్..!
Advertisement

Kalki Movie Music Director Santhosh Narayanan Interesting Comments: పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రేపు అనగా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్రైలర్స్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ ట్రైలర్స్ కల్కిపై మరింతగా అంచనాలను పెంచాయి. వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వడం ఖాయమంటున్నారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో.. పురాణాలు, సైన్స్ కలిపి రూపొందించిన ఈ సినిమాలో పేరుమోసిన నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

కల్కి సినిమాలో మహాభారతం ఉందని, మహాభారతానికి కలియుగం అంతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ ఈ కథను రాసినట్లు ఇంతకుముందే చెప్పిన విషయం తెలిసిందే. ట్రైలర్ లో కూడా మహాభారతంకు సంబంధించిన పలు విజువల్స్ కూడా కనిపించాయి. అయితే, ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో కల్కి మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement

ఆ ఇంటర్వ్యూలో సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ.. కల్కి సినిమాలో మహాభారతం పోర్షన్ కి తాను అందించిన మ్యూజిక్ మగధీర, బాహుబలి సినిమాలకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ కు తన నివాళి లాంటిది అంటూ సంతోష్ పేర్కొన్నారు. తాను అందించిన మ్యూజిక్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమాతో భవిష్యత్ లో మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. దీంతో కల్కి సినిమాలోని మహాభారతం పోర్షన్ కు సంబంధించి మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Also Read: ఇట్స్ అఫీషియల్.. కల్కిలో నేచురల్ స్టార్ నాని.. ఏ క్యారెక్టర్లోనో తెలుసా ?

Advertisement

ప్రభాస్ తోపాటు ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతితోపాటు మరికొంతమంది ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రెబల్ స్టార్’ గా పేరున్న ప్రభాస్ తన బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజ్ లతో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×