BigTV English

Nani in Kalki 2898 AD: ఇట్స్ అఫీషియల్.. కల్కిలో నేచురల్ స్టార్ నాని.. ఏ క్యారెక్టర్లోనో తెలుసా..?

Nani in Kalki 2898 AD: ఇట్స్ అఫీషియల్.. కల్కిలో నేచురల్ స్టార్ నాని.. ఏ క్యారెక్టర్లోనో తెలుసా..?

Natural Star Nani Playing a Role in Kalki 2898 AD Movie: కల్కి 2898 AD. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. సంబరాలకు డార్లింగ్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. సాధారణ థియేటర్ల నుంచి మల్టీప్లెక్స్ ల వరకూ ప్రభాస్ కటౌట్ లను ఏర్పాటు చేసి సినిమా విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. పెద్దహీరో సినిమా అంటే థియేటర్ల వద్ద ఆమాత్రం హడావిడి ఉంటుంది మరి. హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, థౌజండ్ వాలాలు, తీన్ మార్ డ్యాన్సులు. సినిమా చూడటం మాట పక్కనపెడితే.. ఇప్పుడు సినిమా సెలబ్రేషన్ ట్రెండ్ ఇది.


కల్కి 2898 AD. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజురోజుకూ దీనిపై హైప్ పెంచుతూనే వచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. సినిమా కథను రివీల్ చేసీ చేయకుండానే ఎలా ఉండబోతుందో మీరే చూడండి. ట్విస్టులు అదిరిపోతాయ్ అని చెబుతూ వచ్చారు. ఏకంగా రూ.700 కోట్ల భారీ బడ్జెట్ సినిమా. భారీ తారాగణం. అందరూ పెద్ద పెద్ద స్టార్లే. అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లే కాదు. మన టాలీవుడ్ హీరోలూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా లతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా సినిమాలో నటించారని కన్ఫర్మ్ అయింది. అయితే ఈ హీరోలెవరూ ఈ విషయాన్ని ఇంతవరకూ బయటపెట్టలేదు. అంతా సస్పెన్స్ లోనే ఉంచారు. ఇప్పుడు నాని ఉన్నాడని కన్ఫర్మ్ అవడంతో.. నేచురల్ స్టార్ ఫ్యాన్స్ అంతా సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. అయితే కల్కి సినిమాలో ఇంతవరకూ కృష్ణుడి పాత్రలో ఎవరున్నారన్నది రివీల్ చేయలేదు చిత్రయూనిట్. ఈ పాత్ర మాత్రం సినిమా విడుదలయ్యే వరకూ సర్ ప్రైజ్ గానే ఉంటుందని చెప్పింది చిత్రయూనిట్.


Also Read: ఆగిన ఎల్లమ్మ.. మళ్లీ డైలమాలో బలగం వేణు.. ?

కల్కి సినిమాలో క్యామియో రోల్స్ లో.. అంటే అర్జునుడిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడిగా రానా, ఇక మన నాని అభిమన్యుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. సినిమాలో నాని ఉన్నాడన్నది మాత్రం ఫిక్స్. ఏ క్యారెక్టర్లో కనిపిస్తాడన్నది మాత్రం సస్పెన్స్ అనమాట. నాని కల్కి సినిమాలో ఎలా నటించాడో, నటించిన పాత్రకు తన నేచురల్ యాక్టింగ్ తో న్యాయం చేశాడో లేదో తెలియాలంటే.. రేపటి వరకూ కాస్త ఆగాల్సిందే.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×