BigTV English

Mytri Movie makers: ‘మైత్రి’ని పరీక్షించిన ‘రాముడు’.. ఆదుకున్న ‘హనుమాన్’

Mytri Movie makers: ‘మైత్రి’ని పరీక్షించిన ‘రాముడు’.. ఆదుకున్న ‘హనుమాన్’
Tollywood news in telugu

Mythri Movie makers news(Tollywood news in telugu):


ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ భారీ ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. ముఖ్యంగా నిజాంలో అద్భుతమైన టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ హనుమాన్ మూవీ నైజాం రైట్స్‌ని మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేయగా.. భారీ లాభాలను నిర్మాతలు అందుకుంటున్నారు.

ఇదిలా ఉంటే అంతకు ముందు రాముల వారి సినిమాకు ఈ నిర్మాణ సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొంది. అదేంటంటే.. ప్రభాస్ రాముని పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ‘యూవి క్రియేషన్స్’ వారు మొదటిగా కొనుగోలు చేశారు. వారి నుండి ‘పీపుల్ మీడియా’ సొంతం చేసుకుంది. అయితే నైజాం హక్కులను మాత్రం వారి నుండి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ ధరకు దక్కించుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


దీంతో ఈ మూవీ వల్ల నైజాంలో ఫుల్ రన్‌లో మైత్రి మూవీ వారికి దాదాపు రూ.15 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రిలీజైన హనుమాన్ మూవీతో మైత్రి వారికి ఊహించని లాభాలు రావడమే కాకుండా ఆదిపురుష్ సినిమా వల్ల నష్టాలు వచ్చిన దానికంటే ఎక్కువ లాభం హనుమాన్‌తో వస్తున్నట్లు సమాచారం. ఈ హనుమాన్ సినిమా నైజాం రైట్స్‌ని మైత్రి మూవీ వారు రూ.7 కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పటి వరకు రూ.27 కోట్ల షేర్ సాధించి అబ్బురపరచింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×