E-Paper
Advertisement

Naa Anveshana: నా అన్వేష్ పై పోక్సో కేస్..క్లారిటీ ఇచ్చిన అన్వేష్!

Naa Anveshana: నా అన్వేష్ పై పోక్సో కేస్..క్లారిటీ ఇచ్చిన అన్వేష్!
Advertisement

Naa Anveshana: ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , యూట్యూబర్ అన్వేష్. విదేశాలను చుట్టేస్తూ అక్కడ విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా లక్షల్లో సబ్స్క్రైబర్లు పొంది ఏడాదికి కోటికి పైగా ఆదాయాన్ని అందుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరిచిన అన్వేష్.. ఈ మధ్యకాలంలో నోటి దూల కారణంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే గత ఏడాది డిసెంబర్లో శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. అంతటితో ఆగకుండా గరికపాటి పై అలాగే మన భారతదేశాన్ని కూడా దూషిస్తూ నిందలు వేస్తూ తెగ రెచ్చిపోయాడు. దీంతో నెటిజన్స్ మండిపడుతూ వెంటనే ఇతడిని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

అన్వేష్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్..

దీనికి తోడు కరాటే కళ్యాణి లాంటి సెలబ్రిటీలు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇతడిని అరెస్టు చేయాలి అని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించిన విషయం తెలిసిందే. ఇక ఇతడి ఆగడాలు ఆగకపోవడంతో దాదాపు 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఇతడిని అన్ ఫాలో చేశారు. పైగా అన్వేష్ కి వావి వరసలు ఉండవని, 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు కూడా గుప్పించారు. ఫైనల్ గా ఇతడిపై పోక్సో కేస్ కూడా పెట్టాలని మండిపడ్డారు. దీంతో తాజాగా అన్వేష్ ఈ విషయంపై స్పందించారు.

14 ఏళ్ల బాలికపై అన్వేష్ అత్యాచారం.. పోక్సో కేస్ పెట్టాలి..

Advertisement

కొన్ని రోజులుగా అన్వేష్ 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడు.. అతడి పై పోక్సో కేసు పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు కాస్త మరింత వ్యాపిస్తుండడంతో అన్వేష్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఆరోపణలపై అన్వేష్ క్లారిటీ..

అన్వేష్ మాట్లాడుతూ.. నేను 14 ఏళ్ల అమ్మాయిని వ్యభిచారం చేసాను అని వార్తలు వస్తున్నాయి. అవన్నీ అసత్యం. వెనుజులాలో చేసిన వీడియో పై అసత్య ప్రచారం చేశారు. 14 ఏళ్ల అమ్మాయి వ్యభిచారం చేస్తుంటే.. ఆమెకు భోజనం పెట్టించి, వారి తండ్రి అనారోగ్యంతో ఉంటే మందులు కూడా కొనిచ్చాను. ఆ అమ్మాయి నాకు చెల్లితో సమానం. పైగా మీకు కావాలి అంటే నా వీడియోలలో వెనిజులా సీరిస్ లో ఇదంతా ఉంది. కావాలంటే మీరు వెళ్లి చూడండి అంటూ చెప్పారు.

Advertisement

ALSO READ:Dimple Hayati: ఏంటీ.. ఇండస్ట్రీ పెద్ద డింపుల్ తాతగారా.. నిజాలు బయటపెట్టిన బ్యూటీ?

వారితో నా దరిద్రం మొత్తం పోయింది..

కావాలనే తన పరువు తీసారని, అన్ ఫాలో చేసిన వాళ్లతోనే తన దరిద్రం పోయిందని, చెల్లితో అక్రమ సంబంధం అంటగట్టిన నీచులు అంటూ ఒక రేంజ్ లో మండి పడిపోయాడు. ఇకపోతే తనకు ఇప్పటికీ 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని, వాళ్లు సరిపోతారని చెప్పడం గమనార్హం . మొత్తానికైతే అన్వేష్ గత కొద్ది రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా వాటిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×