E-Paper
Advertisement

Game Changer : గ్లోబల్ స్టార్ కి పట్టుకున్న ఓటమి భయం… పరువు పోగొట్టుకోవాల్సిందేనా…?

Game Changer : గ్లోబల్ స్టార్ కి పట్టుకున్న ఓటమి భయం… పరువు పోగొట్టుకోవాల్సిందేనా…?
Advertisement

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వస్తున్నాడు. అందులో ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీలో రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడా ? స్టోరీ ఎలా ఉండబోతుంది అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే మూవీని మొదట డిసెంబర్ 20 న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ అంచనాల ఉన్న సినిమాను ఎందుకు పోస్ట్ పోన్ చేసారు అన్నది ఫ్యాన్స్ లో మొదలైన ఆలోచన.. ఆ సినిమా వల్లే రామ్ చరణ్ సినిమాను పోస్ట్ పోన్ చేసాడని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది . ఆ వార్త ఏంటో ఒకసారి చూసేద్దాం ..

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ ‘..

Advertisement

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండగా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మేకర్స్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. జనవరి 10న ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.. డిసెంబర్ నుంచి సినిమా జనవరి జంప్ అవ్వడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఆ హీరో ఎఫెక్ట్ తోనే సినిమా డేట్ మారిందనే టాక్ వినిపిస్తుంది..

రామ్ చరణ్ కు కి పట్టుకున్న ఓటమి భయం…

Advertisement

గేమ్ ఛేంజర్ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం నాగ చైతన్య నే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్న సెకండ్ మూవీ తండేల్ .. ప్రముఖ పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చందు మొండేటి లాస్ట్ మూవీ సూపర్ హిట్ అయింది… అలాగే నాగర్జునకు ప్రతి సంక్రాంతికి మంచి సెంటిమెంట్ ఉంది… అది చైతన్య కూడా యాడ్ అవ్వచ్చు. వీటన్నిటి వల్ల నాగచైతన్య మూవీకి ప్లస్ అయి రామ్ చరణ్ మూవీ మైనస్ అయితే పెద్ద డిజాస్టర్ అవుతుందని ఆలోచనతో ఓటమి భయం పట్టుకుంది. అనవసరంగా పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకే చరణ్ ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వెయ్యమని కోరటాడట.. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×