E-Paper
Advertisement

Naga Chaitanya Wedding : చై-శోభిత పెళ్లి వేదిక ఇదే… ఈ సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం

Naga Chaitanya Wedding : చై-శోభిత పెళ్లి వేదిక ఇదే… ఈ సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం
Advertisement

Naga Chaitanya Wedding :  టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), హీరోయిన్ శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన వివాహ ఆచారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ కపుల్ రీసెంట్ గా మొట్టమొదటిసారి కలిసి కనిపించారు. ఈ నేపథ్యంలోనే చై – శోభిత పెళ్లికి సంబంధించిన రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి డేట్ తో సహా పెళ్లి వేదిక, పెళ్ళికి హాజరు కాబోతున్న సెలబ్రిటీల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ జంట ఎక్కడ పెళ్లి చేసుకోబోతుందో తెలుసుకుందాం పదండి.

నాగ చైతన్య – శోభిత (Naga Chaitanya and Sobhita Dhulipala) పెళ్లి వేడుకలకు సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట బయట ఎక్కువగా కనిపించడం లేదు. కానీ రీసెంట్ గా జరిగిన ఏఎన్ఆర్ శతజ జయంతి వేడుకల్లో శోభిత – నాగ చైతన్య కలిసి కనిపించారు. మరోవైపు శోభిత ఇంట్లో ఇప్పటికే పసుపు దంచే పెళ్లి కార్యక్రమాలు కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. కానీ ఈ జంట పెళ్లి తేదీని ఇప్పటిదాకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అయితే డిసెంబర్ నెలలోనే పెళ్లి ఉంటుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలింనగర్ సర్కిల్స్ లో.

Advertisement

కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ రాజస్థాన్ లో దేస్తినేషన్ వెడ్డింగ్ చేసుకొనున్నారు అనే రూమర్లు నడిచాయి. తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన డేట్ తో పాటు వేదిక వివరాలు కూడా బయటకు వచ్చాయి. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ స్టార్ కపుల్ పెళ్లి ఉంటుందని, అక్కడే పెళ్లి మండపం సెట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే చై – శోభిత (Naga Chaitanya and Sobhita Dhulipala) పెళ్లికి అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రైవేట్ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి కుటుంబం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి మిగతా స్టార్ హీరోల్లో ఎవరెవరికి అక్కినేని కుటుంబం నుంచి ఆహ్వానం అందుతుంది అనేది తెలియాల్సి ఉంది.

కాగా ఆగస్టులోనే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య – శోభిత (Naga Chaitanya and Sobhita Dhulipala) పెళ్లి వార్తల నడుమ కొన్ని కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో సమంత (Samantha)తో నాగ చైతన్య డివోర్స్ తీసుకున్నట్టు ప్రకటించిన తర్వాత శోభితతో డేటింగ్ మొదలు పెట్టాడని, ఆమె వల్లే ఈ జంట విడాకులు తీసుకున్నారంటూ ట్రోలింగ్ జరిగింది. అలాగే లండన్ మీదుల్లో వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు కొన్ని చక్కర్లు కొట్టాయి. కానీ నాగ చైతన్య మాత్రం వీరిద్దరి మీద వచ్చిన వార్తలను, డేటింగ్ టాక్ ను రూమర్ అంటూ కొట్టి పారేశారు. అలాగే వేరే అమ్మాయిని మధ్యలోకి లాగి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మండిపడ్డాడు. కానీ చివరికి అటు తిరిగి ఇటు తిరిగి శోభితనే ఆయన పెళ్లి చేసుకుంటుండం గమనార్హం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×