BigTV English

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Nagababu : 21 ఏళ్ళ జూనియర్ డాన్సర్ పై.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) లైంగిక దాడి రెండు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి చేసినట్లు బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా.. విచారణ పూర్తి చేసిన తర్వాత నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై పలు సెక్షన్ ల కింద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు వార్తలు రాగా.. పలు బృందాలుగా ఏర్పడి జానీ మాస్టర్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజం నిరూపణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇన్ డైరెక్టుగా జానీ మాస్టర్ పై ట్వీట్ చేసిన నాగబాబు..

అయితే తాజాగా నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. డైరెక్ట్ గా జానీ మాస్టర్ గురించి నాగబాబు ఏమి మాట్లాడకపోయినా.. ఆయన వేసిన ట్వీట్ చూస్తే మాత్రం ఇన్ డైరెక్ట్ గా జానీ మాస్టర్ కోసమే వేసినట్టు తెలుస్తోంది. నాగబాబు తన ట్వీట్ లో.. న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు అంటూ తెలిపారు. అయితే ఆ మాట తాను డైరెక్ట్ గా చెప్పినట్టు కాకుండా ఒక బ్రిటిష్ లాయర్ విలియం గారో కొటేషన్ అని కూడా తెలిపారు. ఇకపోతే నాగబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది..


పార్టీ నుంచి సస్పెండ్..

ఇదిలా ఉండగా జానీ మాస్టర్ జనసేన పార్టీ లో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మెగా కుటుంబంతో కూడా జానీ మాస్టర్ కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ ను జనసేన పార్టీకి దూరంగా ఉండమని అటు పార్టీ కూడా ఆదేశించింది. ఇలాంటి ఎన్నో సంఘటనల మధ్య జానీ మాస్టర్ గురించి నాగబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Nagabubu: Nagabubu's satirical post.. What is Johnny Master..?
Nagabubu: Nagabubu’s satirical post.. What is Johnny Master..?

యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడి..

ఇక అసలు విషయంలోకెళితే.. 2017లో జూనియర్ డాన్సర్ తో పరిచయం అవ్వగా.. అవుట్డోర్ షూటింగ్లో భాగంగా ముంబైకి వెళ్తే అక్కడ హోటల్లో బస చేసినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేశాడని, ఆ తర్వాత క్యారవాన్ లో కూడా తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాడు అంటూ పోలీసుల ముందు తన గోడు వెళ్ళబోసుకుంది ఆ యువతి. ప్రస్తుతం ఆమె వయసు 21 సంవత్సరాలు ఆమె చెప్పిన ఇయర్ ను బట్టి చూస్తే ఆమె మైనర్ గా ఉన్నప్పుడే ఆమె పై దాడి జరిగిందని వార్తలు స్పష్టం అవుతున్నాయి.అయితే మరి కొంతమంది జానీ మాస్టర్ కు అండగా నిలుస్తూ ఎవరో కావాలని కుట్రపన్ని జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ మద్దతు పలుకుతున్నారు. మరి నిజా నిజాలు తెలియాలి అంటే పూర్తి విషయాలు వెలుగులోకి రావాల్సిందే.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×