Inactive Gmail Accounts shutdown| స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ ఉన్న వారందరికీ సాధారణంగా జిమెయిల్ అకౌంట్ ఉంటుంది. యూట్యూబ్ చూడాలన్నా జిమెయిల్ అకౌంట్ ఉంటే మీరు ఇష్టపడే వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అయితే ఈ జిమెయిల్ అకౌంట్స్ కోట్లలో ఉండడంతో గూగుల్ కంపెనీ స్టోరేజీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ కంపెనీ జిమెయిల్ అకౌంట్ల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అందుకే ఇన్ యాక్టివ్ (నిరుపయోగంగా ఉన్న) జిమెయిల్ అకౌంట్స్‌ని పూర్తిగా తొలగించబోతున్నట్లు (shut down) ప్రకటించింది.
జిమెయిల్ అకౌంట్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో గూగుల్ కంపెనీకి సర్వర్స్ లో స్టోరేజి స్పేస్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది ఒకటి కంటే ఎక్కువ జిమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిని ఉపయోగించకుండా వ్యర్థంగా వదిలేస్తున్నారు. అలా 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న జిమెయిల్ అకౌంట్స్ ఇప్పుడు షట్ డౌన్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 20, 2024 నుంచి ఈ నిరుపయోగ జిమెయిల్ అకౌంట్స్ అన్నింటినీ గూగుల్ తొలగించబోతున్నట్లు ఇప్పటికే యూజర్లకు గూగుల్ ఇన్ యాక్టివిటీ పాలసీ నోటిఫికేషన్లు పంపింది.
యూజర్లు నిరుపయోగంగా ఉన్న తమ జిమెయిల్ అకౌంట్స్ ని గూగుల్ షట్ డౌన్ చేయకుండా కాపాడుకోవడం చాలా సింపుల్.
Also Read: లెబనాన్ లో పేజర్ పేలుళ్లు.. మొబైల్ ఫోన్ కూడా పేలిపోతాయా?..
– జిమెయిల్ అకౌంట్ లో లాగిన్ చేయండి.
– యూజర్ ఐడి, పాస్ వర్డ్ మర్చిపోయి ఉంటే ఫోన్ నెంబర్ ద్వారా రికవర్ చేసుకోండి.
– లాగిన్ అయిన తరువాత అకౌంట్ నుంచి ఈమెయిల్స్ సెండ్ చేయండి, మీ స్నేహితుల అకౌంట్స్ నుంచి ఈమెయిల్స్ రిసీవ్ చేసుకుంటూ ఇన్ బాక్స్ లో యాక్టివిటీ చూపించండి.
– జిమెయిల్ తో లాగిన్ అయి యూట్యూబ్ వీడియోలు చూడండి
– జిమెయిల్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయడండి. దీనికోసం గూగుల్ లో లాగిన్ చేసి.. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏ అంశమైనా పరిశీలించండి.
– ఎక్కువ జిమెయిల్ అకౌంట్స్ ఉన్నవారు కూడా.. అన్ని అకౌంట్స్ అవసరమనుకుంటే ప్రతీ అకౌంట్ నుంచి పై చెప్పినవన్నీ తప్పక చేయాలి.
ఒక వేళ మీ జిమెయిల్ అకౌంట్ తొలగించబడితే ఆ అకౌంట్ లోని మీ ఫొటోలు, ఫైల్స్, గూగుల్ మీట్, గూగుల్ డ్రైవ్ డేటా, కంటెంట్ అంతా డెలీట్ అయిపోతుంది. త్వరపడండి.