E-Paper
Advertisement

Nagarjuna Akkineni : రైట‌ర్‌ను డైరెక్ట‌ర్‌గా మారుస్తున్న నాగ్‌..!

Nagarjuna Akkineni : రైట‌ర్‌ను డైరెక్ట‌ర్‌గా మారుస్తున్న నాగ్‌..!
Advertisement

Nagarjuna Akkineni : స్టార్ హీరోలు ఓ సినిమాను ఓకే చేయ‌టానికి చాలా విష‌యాల‌నే ఆలోచించాలి. మార్కెట్‌, అభిమానుల‌కు న‌చ్చుతుందా? లేదా అనే విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే స్క్రిప్ట్‌ను వారు ఓకే చేస్తుంటారు. అందుక‌నే స్టార్ హీరోలు అగ్ర దర్శ‌కుల‌తోనే సినిమాలు చేయ‌టానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. ఎంతో న‌మ్మకం ఉంటే త‌ప్ప కొత్త వారితో సినిమాలు చేయ‌టానికి ఆస‌క్తి చూపించ‌రు. కానీ కొంద‌రు అగ్ర క‌థానాయ‌కులు మాత్రం స్క్రిప్ట్‌ను న‌మ్మి కొత్త వారితో అయినా సినిమాలు చేయ‌టానికి ఓకే చెప్పేస్తుంటారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున ఒక‌రు. త‌న కెరీర్‌లో ఎంతో మంది ద‌ర్శ‌కులు స‌హా టెక్నీషియ‌న్స్‌ను ఎంక‌రేజ్ చేశారు.

ఇప్పుడు నాగార్జున అక్కినేని ఓ కొత్త డైరెక్ట‌ర్‌ని టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. అయితే ఈ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేయలేదు.. ఆయ‌నొక రైట‌ర్‌. రీసెంట్‌గా స‌ద‌రు రైట‌ర్ రాసిన క‌థ‌.. నాగార్జున‌కి బాగా న‌చ్చేసింది. మ‌రో ద‌ర్శ‌కుడితో ఎందుకు డైరెక్ట్ చేయించ‌ట‌మ‌ని ఆయ‌న భావించారేమో. స‌ద‌రు రైట‌ర్‌కే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌చెప్పార‌ట‌. ఇంత‌కీ రైట‌ర్ నుంచి డైరెక్ట‌ర్‌గా మారుతున్న ఆయ‌నెవ‌రో కాదు.. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్‌. ఈయ‌న రైట‌ర్‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ప‌ని చేశారు. నేను లోక‌ల్‌, త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్న ధ‌మాకా చిత్రానికి ఆయ‌న రైట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ప్ర‌స‌న్న డైరెక్ట‌ర్ అవుతున్నారు.

Advertisement

మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న నాగార్జున త్వరలోనే ప్రసన్నకుమార్ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.

    Related News

    Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

    Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

    పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

    యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

    Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

    Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

    Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

    Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

    Big Stories

    Advertisement
    ×