BigTV English

Namrata Shirodkar:కొత్త హోట‌ల్‌ను ప్రారంభించిన న‌మ్ర‌త‌

Namrata Shirodkar:కొత్త హోట‌ల్‌ను ప్రారంభించిన న‌మ్ర‌త‌

Namrata Shirodkar:సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ భ‌ర్త అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నారు. ఎలాగైతే మ‌హేష్ సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టి రాణిస్తున్నారో.. అలాగే న‌మ‌త్ర కూడా వ్యాపార రంగంపైకి దృష్టి సారించింది. ఇటీవ‌ల కాలంలో ఆమె ఏషియ‌న్, మిన‌ర్వా గ్రూప్స్‌తో ఆమె చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే.అందులో భాగంగా రీసెంట్‌గా మిన‌ర్వా కాఫీ షాప్‌ను ప్రారంభించారు. కాగా.. ఇప్పుడు ప్యాలెస్ హైట్స్ అనే మ‌రో హోట్‌ను కూడా ఆమె ప్రారంభించారు. ఈ రెండూ బంజారా హిల్స్‌లో ఉన్నాయి.


ప్యాలెస్ హైట్స్ లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్ తో రాయల్ డైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రెస్టారెంట్. జాహన్వి నారంగ్, జేష్ట్య నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శిరీష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ‌రి ఈ హోట‌ల్ చైన్‌ను ఇంకా కంటిన్యూ చేసే ఆలోచ‌న‌లో న‌మ‌త్ర అండ్ పార్ట‌న‌ర్స్ ఆలోచిస్తున‌ట్లు కూడా స‌మాచారం. న‌మ్ర‌తా శిరోద్క‌ర్ బిజినెస్ స్ట్రాట‌జీతోనే అడుగులు వేస్తుంటారు. మ‌హేష్ సినిమా డేట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌టం వంటివి ఈమె ప్లానింగ్లో భాగ‌మేన‌ని స‌న్నిహితులు అంటుంటారు. అంతెందుకు వీరిద్ద‌రూ త‌మ పిల్ల‌లు గౌత‌మ్‌, సితార‌ల‌తో క‌లిసి ఓ రియ‌ల్ ఎస్టేజ్ యాడ్‌లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక మ‌హేష్ సినిమాల విషయానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శ‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Premi Viswanath: అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వంట‌ల‌క్క‌

Akkineni: అక్కినేని ఫ్యామ‌లీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×