E-Paper
Advertisement

Balakrishna : మన దగ్గర సీక్రెట్లు లేవమ్మా.. అంటూనే ఆ సీక్రెట్ చెప్పేసిన బాలయ్య..

Balakrishna : మన దగ్గర సీక్రెట్లు లేవమ్మా.. అంటూనే ఆ సీక్రెట్ చెప్పేసిన బాలయ్య..
Advertisement
Balakrishna

Balakrishna : నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో ఫ్యాక్షన్ డైలాగులు చెబుతూ అవతల వ్యక్తిని భయపెట్టే విధంగా ఉండే బాలయ్య.. నిజజీవితంలో ఎంతో భోళా స్వ‌భావం కలిగిన వ్యక్తి. ఉన్నది ఉన్నట్టుగా ఒక చిన్న పిల్లాడిలా గబగబా మాట్లాడడం బాలయ్య మేనరిజం అనే విషయం ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకు బాగా తెలుసు. ప్రస్తుతం బాలకృష్ణ భ‌గ‌వంత్ కేసరి మూవీతో దసరాకు సందడి చేయడానికి వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో తన విగ్గు కు సంబంధించిన సీక్రెట్ స్వయంగా బాలయ్యే ఎటువంటి భేష‌జం లేకుండా వెల్లడించాడు.

ఈ ఈవెంట్ లో సుధీర్ఘంగా బాలకృష్ణ సుమారు గంట పాటు ఇచ్చిన స్పీచ్ లో ఎన్నో విషయాల గురించి ఓపెన్ అయ్యారు. అందులో భాగంగానే బాలయ్య తన విగ్గు సీక్రెట్ ని ఎటువంటి నామోషీ లేకుండా వెల్లడించారు. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఎందరో విగ్గులు వాడుతున్నారు. కానీ వీళ్లలో చాలామంది ఒరిజినల్ హెయిర్ స్టైల్ ని వెల్లడించారు. ఎప్పుడు బయటకు వచ్చినా విగ్గు లేకుండా వచ్చేది రజినీకాంత్ ఒక్కడే. ఇక మిగిలిన వాళ్ళు తమ అందమైన హెయిర్ స్టైల్ ని విగ్గుతో పెట్టుకొని మరి బయటికి వస్తారు. అందుకే చాలామంది వాళ్లు విగ్గులు వాడుతున్నారు అని తెలుసుకోలేరు.

Advertisement

అయితే బాలకృష్ణ తనంతట తానే తాను విగ్గు పెడుతున్న విషయం స్పష్టంగా వెల్లడించారు. అసలు విషయానికొస్తే వి.ఎస్ ఆర్ స్వామి తన కెమెరా పనితనాన్ని ఎంతో అద్భుతంగా చూపించి ఆర్టిస్టులను అద్భుతంగా కనిపించేలా చేసేవారని. అదే రకంగా ఇప్పుడు రాంప్రసాద్ కూడా అద్భుతంగా యాక్టర్స్ ను ఆవిష్కరిస్తున్నారని కితాబిచ్చాడు బాలయ్య. రాంప్రసాద్ వీఎస్.ఆర్. స్వామి అసిస్టెంట్ గా పనిచేసిన వాడే కావడంతో బాలయ్యకు అతను బాగా పరిచయస్తుడు.

ఈ నేపథ్యంలో బాలయ్య ఒకప్పటి సెట్స్ గురించి ప్రస్తావిస్తూ.. అప్పట్లో సెట్లలో పని చేయాల్సి వచ్చినప్పుడు మేకప్ లన్నీ హాయిగా ఆరుబయట చెట్ల కింద చాప వేసుకుని కానిచ్చేవారని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్టుగా క్యార‌వ్యాన్ ఎవరికి ఉండేది కావని.. అందరూ ఎంచక్కా ఆరుబ‌య‌ట సేదతీరే వారము అని బాలయ్య అన్నారు. అయితే అలా రిలాక్స్ అయ్యే ఒక సందర్భంలో బాలయ్య తన విగ్గును తీశానని.. అందరి సమక్షంలో దాపరికం లేకుండా చెప్పేశాడు.

Advertisement

ఇక అలాగే ఏదో చెబుతూ.. అప్పుడు ఎవరో “ఈయన విగ్గు పెట్టుకుంటాడా ?”అని అడిగాడని బాలయ్య తనదైన స్టైల్ లో కామెడీగా చెప్పాడు. ఇక దానికి బాలయ్య”అవునయ్యా పెట్టుకుంటాను అయినా నీకెందుకు.. అవును విగ్గు పెట్టుకుంటా..”అని అన్నాడు. అంతేకాకుండా మనదంతా ఓపెన్ బుక్ అమ్మ.. ఎవ్వడికి భయపడేది లేదు.. అంటూ సరదాగా అందరిని కడుపుబ్బా నవ్వించారు. అఖండ సినిమా కోసం రాంప్రసాద్ మంచి లైటింగ్ స్కీంతో ఒక అట్మాస్పియర్ ని క్రియేట్ చేశారట. ఇక ఈ సినిమాకి కూడా ఎటువంటి మాయ చేశారో మీరు స్క్రీన్ మీద చూస్తారు అని బాలయ్య రాంప్రసాద్ ను ఎందుకో తెగ పొగిడేసాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×