BigTV English

Argentina Women Cricket : ఒక ఓవర్ లో 52 పరుగులు..20 ఓవర్లలో 427 పరుగులు..

Argentina Women Cricket  : ఒక ఓవర్ లో 52 పరుగులు..20 ఓవర్లలో 427 పరుగులు..
Argentina Women Cricket

Argentina Women Cricket : ఏమిటీ వింత అని ఆశ్చర్యపోతున్నారా..నిజమండీ బాబూ..అయితే ఈ మ్యాచ్ లో ఇలాంటివి చాలా జరిగాయి. ఈ ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో 20 ఓవర్లకి 427 పరుగులు భారీ స్కోరు కూడా నమోదైంది. ఇంతకీ ఇది మెన్స్ క్రికెట్ లో జరిగింది కాదు.. వుమెన్స్ టీమ్ చేసిన పరుగులండీ బాబూ..ఏమిటిదంతా అని ఆశ్చర్యపోతున్నారా..అవునండీ అవును.. అర్జెంటీనా వుమెన్స్ టీమ్..దంచి కొట్టింది.. పదండి మరి ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం..


అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో టీ 20 ఇంటర్నేషనల్ వుమెన్స్ మ్యాచ్ జరిగింది. అర్జెంటీనా వర్సెస్ చీలీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లోనే ఊచకోత మొదలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన అర్జెంటీనా వుమన్స్ టీమ్ ఏకంగా 20 ఓవర్లలో 427 రన్స్ కొట్టింది. టీ 20 క్రికెట్, పురుషులు, మహిళల క్రికెట్ లో ఇప్పటివరకు నమోదు కాని స్కోరు ఈ మ్యాచ్ లో నమోదైంది. అర్జెంటీనా ఓపెనర్లు లూసియా టేలర్, అల్బెర్టినా గలాన్ కేవలం 16.5 ఓవర్లలోనే తొలి వికెట్ కు ఏకంగా 350 రన్స్ జోడించారు.

లూసియా 84 బంతుల్లో ఏకంగా 169 రన్స్ చేసింది. ఇందులో ఒక్క సిక్స్ కూడా లేదు. 27 ఫోర్లు కొట్టింది. మరో ఓపెనర్ అల్బెర్టీనా కూడా 84 బంతుల్లో 23 ఫోర్లతో 145 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. తర్వాత థర్డ్ డౌన్ వచ్చిన మారియా 16 బంతుల్లో 40 పరుగులు చేసింది.


అయితే అందరికీ ఒక డౌట్ వస్తుంది.
ఉన్న బాల్స్ 20 ఓవర్లలో 120..మరి 427 రన్స్ ఎలా చేశారబ్బా..మీరూహించింది నిజమే..ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే చిలీ టీమ్ ఏం చేసిందంటే ఏకంగా 73 ఎక్స్ ట్రాలు వేసింది. ఇలా అదనపు రన్స్, అదనపు బాల్స్ కూడా వచ్చాయి. ఇందులో 64 నో బాల్స్ వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.

అంటే వేసిన 64 నో బాల్స్ లో చకచకా ఫోర్స్ కొట్టేశారు. ఎందుకంటే .. అవుట్ అయినా నో ప్రాబ్లం కదా..అందుకే ఓపెనర్స్ ఇద్దరూ రెచ్చిపోయారు. మరో చిత్ర విచిత్రం ఒకటి జరిగింది.
అదేమిటంటే చిలీ బౌలర్ మార్టినెజ్ ఒక ఓవర్ లో ఏకంగా 52 పరుగులిచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటే తను వేయాల్సిన ఆరు బాల్స్ కు బదులు 19 నో బాల్స్ వేసింది. దాంతో అన్ని పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.
ఇకపోతే మరో బౌలర్ కాన్ స్టాంజా 4 ఓవర్లలో 92 పరుగులిచ్చింది. మరో బౌలర్ ఎమిలియా కేవలం 3 ఓవర్లలో 83 పరుగులు ఇచ్చింది. ఇలా ఎవరికి వారు..నువ్వెంతంటే నువ్వెంత అన్న రీతిలోనే బౌలింగ్ చేశారు. ఓపెనర్స్ తో బాగా దులిపించుకున్నారు.
ఇదండీ కథ..అర్జెంటీనా మహిళల వీర ఉతుకుడు చూశారు కదండీ..ఇదండీ సంగతి..

తర్వాత బ్యాటింగ్ చేసిన చిలీ జట్టు కేవలం 63 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మరి చిలీ జట్టు విషయంలో మేనేజ్మెంట్ ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×