E-Paper
Advertisement

Dasara : తెలంగాణ ‘దసరా’ కోసం రాయలసీమలో నాని

Dasara : తెలంగాణ ‘దసరా’ కోసం రాయలసీమలో నాని
Advertisement
Dasara

Dasara : నేచురల్ స్టార్ నాని ట్రెండ్‌ని ఫాలో అవుతూ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో చేసిన సినిమా ‘దసరా’. పాన్ ఇండియా మూవీగా మార్చి 30న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ , క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇదంతా బాగానే ఉంది. నాని కూడా మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం ఇండియాలోనే ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నీ తిరిగేస్తున్నాడు. అయితే ఆ మ‌ధ్య‌లో ద‌స‌రా సినిమాపై ఓ కాంట్ర‌వ‌ర్సీ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అదేంటంటే.. ద‌స‌రా సినిమాను తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఆ సినిమాలోని డైలాగ్స్ ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థం కాలేదనే వాద‌న మొద‌లై అది వివాదంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ‘దసరా’ సినిమా వివాదంపై చెక్ పెట్ట‌డానికి నాని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 26న అంటే శ‌నివారం సాయంత్రం అనంత‌పురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. ఎంటైర్ యూనిట్‌ను ఈవెంట్‌కు హాజ‌రు కాబోతున్నారు. ద‌స‌రా సినిమా ఇప్ప‌టికే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా వ్య‌వ‌థి 2 గంట‌ల 39 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

Advertisement

ద‌స‌రా చిత్రంలో నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. డెబ్యూ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్ బ్యాన‌ర్‌పై చెరుకూరి సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీలో నాని రా అండ్ ర‌స్టిక్ లుక్ పోషించారు. తెలంగాణ‌లోని గోదావ‌రి ఖ‌ని బొగ్గు గ‌ని బ్యాక్ డ్రాప్‌తో ద‌స‌రా సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరో వైపు నాని 30వ సినిమా షూటింగ్ జరుగుతుంది. దసరా రిలీజ్ తర్వాత మళ్లీ నాని తన 30వ మూవీ షూటింగ్‌తో బిజీ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×