E-Paper
Advertisement

Pawan Kalyan: రోజురోజుకు పెరుగుతున్న పవన్ బలగం.. జనసేనకు సపోర్ట్ గా కుర్ర హీరోలు

Pawan Kalyan: రోజురోజుకు పెరుగుతున్న పవన్ బలగం.. జనసేనకు సపోర్ట్ గా కుర్ర హీరోలు
Advertisement

Pawan Kalyan: ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జగన్ కు, పవన్ కళ్యాణ్ కు ఈసారి గట్టి పోటీ జరగనుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లోలా కాకుండా పవన్ ఈసారి తన స్ట్రాటజీని పక్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. అంతకుముందు పవన్ కు మద్దతుగా మెగా కుటుంబమే రాలేదు. కానీ, ఇప్పుడు పవన్ బలగం పెరుగుతూ వస్తుంది.

మెగా కుటుంబమే కాకుండా.. సినీ ఇండస్ట్రీలోని కుర్ర హీరోలు సైతం పవన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం ఒక చిన్నపాటి సెలబ్రిటీ ఊరుగా మారిపోయింది. ఒకపక్క జబర్దస్త్ ఆర్టిస్టులు.. ఇంకోపక్క గబ్బర్ సింగ్ బ్యాచ్.. మరోపక్క మెగా హీరోలు.. వరుస పెట్టి ప్రచారాలు సాగిస్తున్నారు. ఇక ఇవి కాకుండా సోషల్ మీడియాలో పవన్ కు సపోర్ట్ చేసే వారు ఎక్కువ అవుతున్నారు. తాజగా న్యాచురల్ స్టార్ నాని.. పవన్ కు అండగా నిలబడ్డాడు. తన మద్దతు పవన్ కే అని పోస్ట్ ద్వారా అధికారికంగా తెలిపాడు.

Advertisement

“ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని మరియు మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఒక సోదరుడుగా నేను మీకు మద్దతుగా నిలబడుతున్నాను.. ఆల్ ది వెరీ బెస్ట్ సార్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన పవన్ అభిమానులు.. నానిని పొగిడేస్తున్నారు. పవన్ కు మద్దతుగా నిలిచినందుకు థాంక్స్ అని చెప్పుకొస్తున్నారు.

కేవలం నాని మాత్రమే కాదు.. కుర్ర హీరో రాజ్ తరుణ్ సైతం పవన్ కు సపోర్ట్ గా నిలబడినట్లు చెప్పుకొచ్చాడు. ” మొదటిరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ కోసం శ్రేయస్సు కోసం మీరు పడే కష్టాన్ని, మీ విజన్ ను చూస్తున్నాను. లక్షలాది మంది ఆశలను తీర్చడానికి మీరు ముందుకు వచ్చి ప్రజల భవిష్యత్తును మంచిగా మార్చాలని కోరుకుంటున్నాను సార్.. ఇప్పుడు జనం కు నువ్వు కావాలి” అని పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ.. జై జనసేన అని రాసుకొచ్చాడు. ఉన్నకొద్దీ ఇండస్ట్రీలో కూడా పవన్ కు బలగం పెరుగుతుంది. మరి ముందు ముందు ఇంకెంతమంది.. పవన్ కు అండగా నిలబడతారో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×