Big Stories

Arvind Kejriwal: కేజ్రీవాల్‌‌కు కోర్టులో చుక్కెదురు.. మే 20 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ నేటితో ముగియగా ఈ నెల 20వ తేదీ వరకు కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

- Advertisement -

లిక్కర్ పాలసీ కేసులో భాగంగా జైలులో ఉన్న కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి విచారణ మరో రెండు లేదా మూడు రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ లిక్కర్ పాలసీ కేసులో భాగంగా బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. సార్వత్రిక ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. లిక్కర్ పాలసీ కేసుతో సంబంధం ఉన్న ఫైల్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ చూడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పై బయటకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రిగా అధికారికంగా ఎటువంటి బాధ్యతలు నిర్వహించకూడదని తేల్చి చెప్పింది.

అయితే కేసు విచారణలో భాగంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ఈడీ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని ఈడీ తన అభిప్రాయాన్ని కోర్టులో వెల్లడించింది. కేసుల విషయంలో సామాన్యుల మాదిరిగానే రాజకీయ నాయకులను కూడా చూడాలని వారికి ఎటువంటి మినిహాయింపులు ఉండకూడదని స్పష్టం చేసింది.

Also Read: మనీలాండరింగ్ కేసు.. జార్ఖండ్ మంత్రి పీఏ, పనిమనిషి అరెస్ట్

ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ పై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వ్ లో ఉంచింది. ఓ వైపు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుతో పాటుగా.. బెయిల్ పిటిషన్ పై కూడా తీర్పు వెల్లడికాకపోవడంతో ఆప్ వర్గాలు తీవ్ర నిరాశ చెందాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News