E-Paper
Advertisement

Annapoorani : ఓటీటీ నుంచి నయనతార సినిమా అవుట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ..

Annapoorani : ఓటీటీ నుంచి నయనతార సినిమా అవుట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ..
Advertisement

Annapoorani : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూరణి సినిమా.. ఆమెకు కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నయనతార ప్రధానపాత్ర పోషించింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలవ్వగా.. తన సహజమైన నటనతో నయన్ అందరినీ ఆకట్టుకుంది. కానీ.. ఊహించని రీతిలో వచ్చిన వివాదం కారణంగా సినిమాను చిత్రనిర్మాణ సంస్థ అయిన జీ స్టూడియోస్.. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించింది. అందుకు వివరణ కూడా ఇచ్చింది.

నయనతార 75వ చిత్రంగా అన్నపూరణి.. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ తో విడుదలైంది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్, జై కీలక పాత్రలు పోషించారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఒక అమ్మాయి.. చెఫ్ గా ఎదగాలనుకున్న తన కలను ఎలా సాకారాం చేసుకుంది ? అడ్డంకులను ఎలా అధిగమించింది? అన్న కోణంలో చిత్రాన్ని తెరకెక్కించారు.

Advertisement

అయితే.. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మత విద్వేషాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ.. విశ్వహిందూ పరిషత్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రమేశ్ సోలంకి సినిమాపై కేసు పెట్టడంతో.. వివాదం మరింత పెరిగింది. దాంతో చిత్రనిర్మాణ సంస్థ అన్నపూరణిని ఓటీటీ నుంచి తొలగించింది. మత విశ్వాసాలని దెబ్బతీసి, విద్వేషాలను పెంచాలన్న ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చి, తమ సినిమా ఎవరినైనా ఇబ్బందులకు గురిచేసి ఉంటే క్షమించాలని కోరింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×