Bramhamudi Appu : బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారం అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో వాటికి క్రేజ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. స్టార్ మా లో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ను నమోదు చేసుకోవడంతో పాటుగా.. అందులో నటించే ప్రతి సీరియల్ యాక్టర్ కి కూడా మంచి క్రేజ్ కూడా దక్కింది. అలాంటి సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో ఒకప్పుడు అప్పు పాత్రలో నటించిన ముద్దుగుమ్మ ఇప్పుడు సీరియల్స్ కి దూరంగా ఉంటుందా? ఇక మీదట సీరియల్స్ చేయదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి అప్పు నిజంగానే సీరియల్స్ చేయదా అన్న ప్రశ్నలకు సమాధానం ఏంటో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
బ్రహ్మముడి సీరియల్ లో అప్పు పాత్రలో నటిస్తున్న బ్యూటీ ఇప్పుడు సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు. ఈ సీరియల్ తర్వాత ఈ మధ్య వచ్చిన ఏ సీరియల్ లో కూడా అప్పు కనిపించకపోవడంతో ఇక సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసిన అన్న ప్రశ్నలు కూడా జనాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఆమెకు సీరియల్ అవకాశాలు రావడం లేదా ఎందుకు ఆమెను తీసుకోవడం లేదు అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇటీవలే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అప్పు ప్రస్తుతం సీరియల్స్ కి కాస్త గ్యాప్ తీసుకుందని సోషల్ మీడియాలో సమాచారం. అయితే కొన్ని నెలల తర్వాత మళ్లీ సీరియల్స్ లేదా సినిమాలు చేస్తే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. మరి అప్పు సీరియల్స్ కి గుడ్ బై చెప్పిందా లేదా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆమె రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
బ్రహ్మముడి సీరియల్ లో ఒకప్పుడు మంచి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అప్పు అసలు పేరు నైనిషా రాయ్.. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే నటనపై ఆసక్తితో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. జీ తెలుగులో చామంతి సీరియల్ లో హీరోగా నటిస్తున్న ఆశిష్ చక్రవర్తితో ఈమె ప్రేమలో ఉన్న విషయాన్ని రివిల్ చేసింది. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని కూడా చెప్పేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేసుకుంది ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నైన్ షాప్ పెళ్లి తర్వాత తన కుటుంబం తనకి దగ్గరవుతుందా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు జనాలు వినిపిస్తుంది. అంతేకాదు ఈమె సీరియల్స్ చేస్తుందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఈమె రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక అప్పు నెక్స్ట్ ఎలాంటి సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..