E-Paper
Advertisement

Nayanathara: సూర్య సినిమాలో నటించడం నేను తీసుకున్న అతి పెద్ద చెత్త నిర్ణయం

Nayanathara: సూర్య సినిమాలో నటించడం నేను తీసుకున్న అతి పెద్ద చెత్త నిర్ణయం
Advertisement

Nayanathara: ఇండస్ట్రీలో నటించే హీరో హీరోయిన్లు.. అన్నిసార్లు తమకు నచ్చినట్లు చేయలేరు. కొన్నిపాత్రలు ఎంతో ఇష్టపడి చేస్తారు. కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుంది. కథ చెప్పినప్పుడు ఒకలా ఉండే వారి క్యారెక్టర్.. సినిమాలో వేరేలా మారిపోతుంది. ఒకసారి ఓకే చెప్పాకా.. కచ్చితంగా సినిమా చేసి తీరాల్సిందే. ఆ తరువాత ఈ సినిమ ఒప్పుకోవడం చెత్త నిర్ణయాల్లో ఒకటి అని చెప్పుకొస్తారు.

ప్రస్తుతం నయన్ కూడా అలానే ఒక సినిమా ఒప్పుకోవడం తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద చెత్త నిర్ణయమని తెలిపింది. ఆ సినిమా ఏదో కాదు.. గజినీ. సూర్య, ఆసిన్ జంటగా నటించిన ఈ చిత్రంలో నయన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ కానీ, సీన్స్ కానీ ఎక్కడో ఒకచోట ప్లే అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా ద్వారా ఆసిన్ కు మంచి పేరు వచ్చింది కానీ, నయన్ కు అంతగా గుర్తింపు రాలేదు. అయితే మొదట తన పాత్ర చెప్పిన విధానం వేరు అని, అందులో చూపించింది వేరు అని నయన్ వాపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడింది.

” గజినీ కథ చెప్పినప్పుడు నా పాత్రను వేరే విధంగా వివరించారు. తెరకెక్కించేటప్పుడు వేరేలా చూపించారు. నా ఫోటోలను భిన్నంగా చూపించారు. అందుకే నా జీవితంలో ఈ సినిమాను ఓకే చేయడం నేను తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ ప్రస్తుతం నయన్ తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×