E-Paper
Advertisement

NBK 108 Heroine : హ‌మ్మ‌య్య‌.. బాల‌య్య‌కి హీరోయిన్ దొరికేసింది

NBK 108 Heroine : హ‌మ్మ‌య్య‌.. బాల‌య్య‌కి హీరోయిన్ దొరికేసింది
Advertisement

NBK 108 Heroine : నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే ద‌ర్శ‌కుడిని హీరోయిన్ స‌మ‌స్య ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆయ‌న గ‌త చిత్రాల విష‌యంలో నెట్టింట బాల‌య్య‌కు హీరోయిన్ దొర‌క‌లేద‌నే వార్త‌లు బాగానే వినిపించాయి. అయితే బాలకృష్ణ‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్న ద‌ర్శ‌కుడు మాత్రం అలాంటి వార్త‌ల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని అనుకోలేదు. అందుక‌నే సినిమా స్టార్టింగ్‌లోనే హీరోయిన్‌ని ఫిక్స్ చేసేసుకున్నారు. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడో తెలుసా! అనీల్ రావిపూడి.

బాల‌కృష్ణ హీరోగా త‌దుప‌రి సినిమాను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌నున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చేసింది. గ‌త కొన్ని రోజులుగా దీనిపైనే అనీల్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో బిజీగా ఉంటున్నారు. ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 8న NBK 108 లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక జ‌వాల్క‌ర్‌ను ఫిక్స్ చేశారు. టాక్సీ వాలా, తిమ్మ‌రుసు, ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే స్టార్ హీరోతో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా పెద్ద హిట్ అయితే ప్రియాంక కెరీర్‌కు ప్ల‌స్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.

Advertisement

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 107వ సినిమా వీర సింహ‌రెడ్డి సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఎందుకంటే సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గోపీ చంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×