E-Paper
Advertisement

Tamannaah Bhatia Marriage: ముంబై బిజినెస్‌మేన్‌తో పెళ్లిపై త‌మ‌న్నాక్లారిటీ!

Tamannaah Bhatia Marriage: ముంబై బిజినెస్‌మేన్‌తో పెళ్లిపై త‌మ‌న్నాక్లారిటీ!
Advertisement

Tamannaah Bhatia Marriage: సినీ ఇండ‌స్ట్రీలోకి మిల్కీ బ్యూటీ అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతుంది. మూడు ప‌దులు చేరుకున్న అమ్మ‌డు పెళ్లి ఊసే ఎత్త‌టం లేదు. ఈ నేప‌థ్యంలో రీసెంట్‌గా ఆమె పెళ్లి ముంబైకి చెందిన ఓ బిజినెస్ మేన్‌తో జ‌ర‌గ‌నుందంటూ నెట్టింట వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్నా త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. ‘కొందరైతే నా పెళ్లి ఎప్పుడో చేసేశారు. డాక్టర్, బిజినెస్ మేన్ అంటూ వారికి ఇష్టం వ‌చ్చిన రీతిలో వార్త‌లు రాసేస్తున్నారు. రీసెంట్‌గా ముంబైకి చెందిన బిజినెస్‌మేన్‌తో నా పెళ్లంటూ వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదు. నిజంగా పెళ్లి చేసుకుంటే అంద‌రికీ చెప్పే చేసుకుంటాను. ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారు. కానీ నేను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదు. రూమ‌ర్స్‌ను నేను ప‌ట్టించుకోను’ అని తెలిపారు తమన్నా.

ఇంకా ఆమె మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టిస్తోన్న భోళా శంక‌ర్ సినిమా గురించిన అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు తాను జాయిన్ కాలేద‌ని, వ‌చ్చే నెల నుంచి త‌న షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని ఆమె తెలియ‌జేసింది. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. త‌మిళంలో శ్రుతీ హాస‌న్ చేసిన పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో భోళా శంక‌ర్ సినిమా రిలీజ్ కానుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌త్య‌దేవ్‌తో త‌మ‌న్నా క‌లిసి న‌టించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం సినిమా డిసెంబ‌ర్ 9న రిలీజ్‌కి సిద్ధ‌మైంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×