E-Paper
Advertisement

Neena Gupta: బోల్డ్ యాక్టర్ నీనా గుప్తా ఇకలేరు.. అలాంటి ట్యాగ్ లు అంటగట్టకండి

Neena Gupta: బోల్డ్ యాక్టర్ నీనా గుప్తా ఇకలేరు.. అలాంటి ట్యాగ్ లు అంటగట్టకండి
Advertisement

Neena Gupta: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు కానీ, ఆర్టిస్టులు కానీ అంత తెలివితేటలతో ఉండేవారు కాదు. సినిమాలు వచ్చాయి.. డబ్బులు సంపాదించడం కోసం ఎలాంటి పాత్రలు అయినా చేయాలి. ఇదే అప్పట్లో వారి మైండ్ సెట్. ఇప్పుడు హీరోయిన్స్ అలా కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయ్యిందా .. యాడ్స్ చేయాలి. రెండు చేతుల డబ్బులు సంపాదిస్తే వేరే రంగంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు అందరి పాలసీ ఇదే. కానీ తనకు అప్పట్లో ఇవేమి తెలియదని, డబ్బు కోసం ఎలాంటి పాత్రలు అయినా నో చెప్పకుండా చేసేదాన్ని అని బాలీవుడ్ నటి నీనా గుప్తా చెప్పుకొచ్చింది.

నీనా గుప్తా .. తెలుగు ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేని పేరు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూ ఉండడంతో బాలీవుడ్ నటీనటులు తెలుగువారికి కూడా పరిచయమవుతున్నారు. లస్ట్ స్టోరీస్ 2 లో మృణాల్ ఠాకూర్ కు శృంగారం గురించి ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్న బామ్మ ఎవరో కాదు నీనా గుప్తానే. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సులో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నీనా.. తన కెరీర్ లో పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

Advertisement

” నేను ఢిల్లీ నుంచి వచ్చాను. సినిమాల మీద ఉన్న మక్కువతో ముంబైకి వచ్చాను. ఇక్కడకు వచ్చాక నాకు మొదట్లో అస్సలు నచ్చలేదు. ఎన్నోసార్లు వెళ్ళిపోదామని అనుకున్నాను. ప్రతి మూడు నెలలకు బ్యాగ్ సర్దుకొని కూర్చొనేదాన్ని. కానీ, ముంబై నన్ను వెళ్లనిచ్చేది కాదు. అప్పట్లో డబ్బు కోసం ఏ పాత్ర వచ్చినా చేసేదాన్ని. నో అని చెప్పేదాన్ని కాదు. నచ్చకపోయినా ఆ పాత్రలో నటించి.. ఇంటికి వచ్చి దేవుడా ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా చూడు అంటూ ప్రార్దించేదాన్ని. ఇప్పుడు అలా లేను.. కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నాను.

ఇండస్ట్రీలో నన్ను అందరూ రెబల్ అని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో నాకే అర్ధం కావడం లేదు. మొదటి నుంచి కూడా నేను అమాయకమైన అమ్మాయి పాత్రలోనే నటించేదాన్ని. పవర్ ఫుల్ రోల్స్ కానీ, రెబల్ రోల్స్ కానీ చేసింది లేదు. అయినా నన్ను రెబల్ అంటున్నారు. ట్యాగ్ లు అంటగడుతున్నారు. రేపు నేను చనిపోయాక.. బోల్డ్ యాక్టర్ నీనా గుప్తా ఇకలేరు అనే ట్యాగ్ లు పెట్టి రాస్తారేమో.. దయచేసి అలాంటి ట్యాగ్స్ నాకు అలాంటి ట్యాగ్ లు అంటగట్టకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నీనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×