E-Paper
Advertisement

Mahesh Babu : మొన్న రామ్ చరణ్, నిన్న ఎన్టీఆర్, నేడు మహేష్ బాబు .. నెట్ ఫ్లిక్స్ మాస్టర్ ప్లాన్ ఏమిటో?

Mahesh Babu : మొన్న రామ్ చరణ్, నిన్న ఎన్టీఆర్, నేడు మహేష్ బాబు .. నెట్ ఫ్లిక్స్ మాస్టర్ ప్లాన్ ఏమిటో?
Advertisement
Mahesh Babu

Mahesh Babu : ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలపై కన్నేసిందా అని డౌట్ కలుగుతుంది. మొన్నటికి మొన్న రామ్ చరణ్.. నిన్న ఎన్టీఆర్.. మరి ఈరోజు ఏకంగా మహేష్ బాబు.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యామిలీస్ తో వరుస పెట్టి నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండొస్ భేటీ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు బాలీవుడ్ యాక్టర్లతో మంతనాలు సాగించే నెట్ ఫ్లిక్స్ సంస్థకు సడన్ గా టాలీవుడ్ ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కావడం లేదు. అసలు ఈ మంతనాల వెనక అసలు రహస్యం ఏమిటో.. ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు.ఉన్న అన్ని ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లోకి భారీగా మంత్లీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడంతో పాటు మంచి సాలిడ్ కంటెంట్ మూవీస్ , వెబ్ సిరీస్ తో బాగా ఎంటర్టైన్ చేసే ప్లాట్ఫామ్ ఇది. మొదట్లో హాలీవుడ్ బాలీవుడ్ పైన మాత్రమే తన దృష్టిని ఎక్కువగా పెట్టిన ఈ ప్లాట్ఫారం.. ప్రస్తుతం రీజనల్ లాంగ్వేజెస్ పై కూడా తన ఫోకస్ పెడుతుంది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ సంస్థ టాలీవుడ్ హీరోలపై మనసు ఎందుకు పారేసుకుందో ఎవరికి అర్థం కావడం లేదు.

Advertisement

మొన్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీతో ముచ్చట్లు జరిపి.. నిన్న యంగ్ హీరో ఎన్టీఆర్ ఇంట్లో మీట్ అయి.. నేడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తోటే భేటీ పెట్టాడు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండొస్. ఈ మంతనాల వెనుక రహస్యం ఏమిటి అనేది ఎవరికీ అంత చిక్కడం లేదు. ఈ స్టార్ హీరోల కుటుంబాలతో మంతనాలు జరపడంతో పాటు ఫోటోలు కూడా దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను నెట్ ఫ్లిక్స్ టీమ్.

ఈరోజు మహేష్ బాబు ఇంట్లో ప్రత్యక్షమైన నెట్ ఫ్లిక్స్ బృందం.. త్రివిక్రమ్ ని కూడా కలిసి మంతనాలు జరిపారు. ఇక ఈ మీటింగ్ కి సంబంధించిన ఫోటో ని మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేస్తూ.. కాఫీ విత్ చిల్ అంటూ క్యాప్షన్ పెట్టారు. అలాగే ఫ్యూచర్ గురించి కొన్ని ఆసక్తికర సంభాషణలు ఈ మీటింగ్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం హాట్ డిస్కషన్ గా మారింది. ఒకరి తర్వాత ఒకరు ఇలా వరుసగా స్టార్ హీరోలతో వీళ్ళు ఎందుకు భేటీ అవుతున్నారు అని అందరూ ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ మామ మా హీరోలతో ఏం ప్లాన్ చేస్తున్నావ్.. అంటూ నెట్ ఫ్లిక్స్ ని ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి ఏదైనా పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోందా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×