BigTV English

Hyderabad : ఫిలిం నగర్‌లో దంపతుల హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

Hyderabad : ఫిలిం నగర్‌లో దంపతుల హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

Hyderabad : అప్పులు తీర్చలేదని భర్యా, భర్తలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కలకలం రేపింది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.


పోలీసుల కథనం ప్రకారం.. ఫిలిం నగర్‌లోని సత్య కాలనీలో ఖాద్రీ, ఫాతిమా దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజులుగా ఫాతిమా తన సోదరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా.. ఫాతిమా ఊరివేసుకోని చనిపోయింది. పిల్లలు పుట్టకపోవడంతో ఫాతిమాని చంపి ఖాద్రి పాడిపోయారని ఫాతిమా చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దంపతుల ఇంటి పరిసర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ నీ పోలీసులు పరిశీలించారు. ఫాతిమాని చంపి ముగ్గురు బయటికి వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునీ ప్రశ్నించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూడు ఏళ్ల క్రితం ముంబైకి చెందిన వ్యాపారుల దగ్గర్నుంచి ఖాద్రి, ఫాతిమాలు మేకల వ్యాపారం కోసం 20 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. మూడేళ్లుగా అప్పు చెల్లించకుండా దంపతులు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు.


ఈ నెల రెండో తేదీన వ్యాపారులు హైదరాబాదుకు వచ్చి టోలిచౌక్లో ఆశ్రయం తీసుకున్నారు. మూడో తేదీన వ్యాపారులు ఖాద్రిని కిడ్నాప్ చేసి హత్య చేసి పాతిపెట్టారు. ఫాతిమా కిడ్నాప్ విషయం బయటపెడుతుందని మరుసటి రోజు వ్యాపారులు ఇంటికి వెళ్లారు. ఫాతిమాకి ఊరివేసి చంపేశారు. గ్యాస్ లీక్ చేసి వ్యాపారులు అక్కడి నుంచి పారిపోయారు. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు చేశారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×