E-Paper
Advertisement

New Year Party Songs: ఈ పాటలతో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవాల్సిందే..!

New Year Party Songs: ఈ పాటలతో సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోవాల్సిందే..!
Advertisement

New Year Party Songs: న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. నయా సాల్ పార్టీలతో జోష్ తారా స్థాయికి చేరనుంది. అంతేకాదు.. ఈ ఏడాది డిసెంబర్ 31 ఆదివారం కావడంతో ఈ సారి మరింత గ్రాండ్‌గా న్యూ ఇయర్ పార్టీల కోసం ఈవెంట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకులు కొత్త కొత్త థీమ్స్‌తో వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. స్నేహితులు, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే ఈ న్యూ ఇయర్ పార్టీలను మైదానాల్లో.. విద్యుత్ దీపాల ధగధగల మధ్య.. డీజేల సంగీత హోరులో సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయి. ఇక ఈ వేడుకల్లో జోష్ పెంచేందుకు వీలుగా ఇటీవల విడుదలైన మూవీల్లోని హిట్ సాంగ్స్, రీమిక్స్ సాంగ్, మాస్ బీట్స్‌తో హోరెత్తించే పాటలుప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండీ పాటలతో బాక్సులు బద్దలైపోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ మాస్ బీట్ సాంగ్స్ ఏవో చూసేద్దాం..

Advertisement

‘డీజే టిల్లు’తో మాస్ క్రేజ్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల రెండు పాటలు రిలీజ్ కాగా.. అందులోని ‘టికెట్టే కొనకుండా’ అంటూ సాగే సాంగ్‌ న్యూ ఇయర్ సెలబ్రెషన్ వేడుకల్లో ఓ ఊపు ఊపేస్తుంది. దీంతోపాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించిన ‘జవాన్’ నుంచి ‘రామయ్య వస్తావయ్య’, పఠాన్ మూవీ నుంచి ‘బెషరం రంగ్’ సాంగ్ కూడా పార్టీ ప్రియులతో మాస్ డ్యాన్స్‌లు వేయిస్తుంది. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ నుంచి ‘హా.. నువు కావలయ్యా’ సాంగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్స్ రానివాళ్లకు కూడా ఈ సాంగ్ ఊపు తెప్పిస్తుంది.

వీటితో పాటు విజయ్ నటించిన ‘వారసుడు’ నుంచి ‘రంజితమే’ సాంగ్, నాని నటించిన ‘హాయ్ నాన్న’ నుంచి ‘ఓడియమ్మ హీటు’ సాంగ్స్‌తో మైదానాల్లో పార్టీల జోష్ ఊపందుకోనున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×