BigTV English

Campus Recruitment : క్యాంపస్ కొలువులు రావట్లే.. కారణం ఏంటి ?

Campus Recruitment : క్యాంపస్ కొలువులు రావట్లే.. కారణం ఏంటి ?

Campus Recruitment : గతంలో ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో ఉండగానే.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల సందడి మొదలయ్యేది. ఇక.. నాలుగో ఏడాది పరీక్షలు పూర్తయి, సర్టిఫికెట్లు చేతికొచ్చే సరికి.. లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లెటర్ కూడా చేతికొచ్చేది. గ‌త పది, పదిహేనేళ్లుగా కాస్త అటు ఇటుగా ఈ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది.


అయితే.. కొవిడ్ తర్వాత ఐటీ కంపెనీలు ముఖం చాటేయటంతో కేంపస్ సెలక్షన్లు తగ్గుతూ వస్తుండగా, ప్రస్తుత ఏడాది ఈ రిక్రూట్‌మెంట్లు కనిష్ట స్థాయికి చేరాయి. దీంతో ఇంజనీరింగ్ కళాశాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. నిరుటితో పోల్చితే ఈ ఏడాది ప్లేస్‌మెంట్లు సగానికి పడిపోవటంతో అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.

తమ క్లయింట్ల నుంచి అనుకున్న స్థాయిలో ప్రాజెక్టులు రాకపోవటంతోనే తాము అనుకున్న స్థాయిలో కేంపస్ రిక్రూట్‌మెంట్ల మీద దృష్టి పెట్టలేకపోతున్నామని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. 2022లో చివరి సంవత్సరం వచ్చే సరికి ఓ మోస్తరు కాలేజీల్లోని 60 శాతం విద్యార్థులకు కొలువులు దక్కగా, 2023 నాటికి ఇది కేవలం 30 శాతానికి పరిమితమైంది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ వరకు 2023లో ప్లేస్‌మెంట్లు 30 శాతం దాటలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.


ఐటీ ఎక్స్‌పోర్ట్‌‌లో వృద్ధి తగ్గటం, క్లయింట్ల స్పెండింగ్ పడిపోవటంతో ఈసారి ఐటీ కంపెనీలు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల విష‌యంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాయి. గతంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనగా తాజాగా వచ్చిన పాల‌స్తీనా – ఇజ్రాయెల్ యుద్ధం అర్థవ్యవస్థను అతలాకుతలం చేయనుందనే ఆందోళనలు పశ్చిమ దేశాల్లో కనిపిస్తున్నాయి. దీంతో కొత్త నియామకాలు తగ్గించుకోవటంతో బాటు వేతనాలు కూడా తగ్గిపోతున్నాయి.

మంచి రేటింగ్ ఉన్న కాలేజీల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మధ్యరకం, దిగువ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పలు కంపెనీలు తమ కాలేజీలను పరిగణనలోకే తీసుకోవటం లేదని సదరు కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఏడాది నాటికి తమ అడ్మిషన్లు కూడా గణనీయంగా పడిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇక.. మిగిలిన బ్రాంచి విద్యార్థుల కంటే ఐటీ బ్రాంచ్‌ విద్యార్థుల‌కే కాస్తో కూస్తో ప్లేస్‌మెంట్లు దొరుకుతున్నాయి తప్ప మిగ‌తా బ్రాంచ్‌ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని పెద్ద కాలేజీలు పట్టుబట్టి ఐటీ కంపెనీల వారిని రప్పించి సెలక్షన్స్ పేరుతో హడావుడి చేస్తున్నా.. చిన్నా చితకా ఉద్యోగాలే తప్ప చెప్పుకోదగ్గ కొలువులు దక్కటం లేదు.

Related News

SSC Recruitment: ఎస్ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే సరిపోతుంది, పూర్తి వివరాలివే..

Canara Bank: డిగ్రీ అర్హతతో 3500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు, అప్లై విధానం ఇదే..

IB Recruitment: టెన్త్ క్లాస్‌తో ఐబీలో భారీగా ఉద్యోగాలు.. రూ.69,100 జీతం, దరఖాస్తుకు ఇంకా 3రోజులే

Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

RRB Group-D: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇలా చదివితే ఉద్యోగం మీదే గురూ, రోజుకు 5 గంటలు చాలు..!

SSC Constable: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.81,000 జీతం.. ఇదే మంచి అవకాశం బ్రో

DDA: డీడీఏ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎక్స్‌లెంట్ జాబ్స్, ఇదే మంచి అవకాశం

Prasar Bharati Jobs: డిగ్రీతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. మంచి వేతనం, సింపుల్ ప్రాసెస్

Big Stories

×