E-Paper
Advertisement

Priyadarshi: ప్రియదర్శికి జోడీగా నిహారిక.. ఈ సారి మరింత సాలిడ్ కంటెంట్‌తో రెడీ..?

Priyadarshi: ప్రియదర్శికి జోడీగా నిహారిక.. ఈ సారి మరింత సాలిడ్ కంటెంట్‌తో రెడీ..?
Advertisement

Niharika NM- Priyadarshi Movie update(Cinema news in telugu): చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులుగా, సైడ్ క్యారెక్టర్లతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ఒకరు. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ పాత్రలో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా వరుస సినిమాల్లో సైడ్ పాత్రలు చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఆ తర్వాత జాతిరత్నాలు మూవీలో నటించాడు. ఆ సినిమాలో తన పంచ్ డైలాగ్‌లతో దుమ్ము దులిపేశాడు.

ఇక గతేడాది ‘బలగం’ సినిమాలో లీడ్ రోల్‌లో నటించి అదరగొట్టేశాడు. ఈ సినిమా యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. అలా వరుస సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ప్రియదర్శి ఇటీవలే మరో సినిమాతో వచ్చాడు. ‘డార్లింగ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో అతడి యాక్టింగ్‌కు సినీ ప్రియులు ప్రశంసలు కురిపించారు.

Advertisement

Also Read: ఉపాధ్యాయుడి పాత్రలో ప్రియదర్శి.. మొండి గురువు చాణక్య గ్లింప్స్ అదుర్స్

ఇక ఇప్పుడు ప్రియదర్శి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడి కెరీర్‌లో ఈ సినిమా మంచి బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా ఒక ఫేమస్ కంటెంట్ క్రియేటర్ హీరోయిన్‌గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు నిహారిక ఎన్ఎం. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీ అమెరికాలో ఎడ్యుకేషన్‌ పూర్తి చేసింది. అయితే చదువుకుంటున్న సమయంలోనే కొత్త కొత్త వీడియోలను డిఫరెంట్ టైప్‌లో ప్రెజెంట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

గతంలో అడివిశేష్ నటించిన ‘మేజర్’, యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమాల కోసం బాగా ప్రమోషన్స్ చేసింది. ఈ సినిమాలనే కాకుండా మరెన్నో చిత్రాలకు హీరోలతో కలిసి ప్రమోట్ చేసి బాగా పాపులర్ అయింది. అయితే అలా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ ఆమెకు స్పెషల్ విషెస్ తెలిపింది. అయితే అప్పుడే అందరికి డౌట్ వచ్చింది. ఆమె ఈ బ్యానర్‌లో ఏదో ఒక సినిమా చేయబోతుందని. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ప్రియదర్శి హీరోగా నిహారిక హీరోయిన్‌గా ఒక కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రియదర్శి ఈసారి మరింత సాలిడ్ కంటెంట్‌తో రాబోతున్నాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రానుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×