E-Paper
Advertisement

Appudo Ippudo Eppudo Teaser: ప్రపంచంలో అబ్బాయిలందరూ తాగడానికి కారణం అమ్మాయిలేరా..

Appudo Ippudo Eppudo Teaser: ప్రపంచంలో అబ్బాయిలందరూ తాగడానికి కారణం అమ్మాయిలేరా..
Advertisement

Appudo Ippudo Eppudo Teaser:  కార్తికేయ 2  పాన్ ఇండియా హిట్ అందుకున్నాకా యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ లైఫ్ మారిపోయింది. ఈ సినిమా తరువాత నిఖిల్ అన్ని పాన్ ఇండియా సినిమాలే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న మరో చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన సప్తసాగరాలు దాటి  బ్యూటీ రుక్మిణి వసంత్, మజిలీ ఫేమ్ దివ్యాంష నటిస్తున్నారు.

అసలు ఈ సినిమా ఎప్పుడు  మొదలయ్యిందో తెలియదు కానీ.. అప్పుడే ప్రమోషన్స్  కూడా మొదలుపెట్టేశారు. ఈ మధ్యనే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టైటిల్ ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మేకర్స్.. ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేసి మరింత షాక్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నిఖిల్ రేసర్ గా కనిపించాడు. ” వీడి పేరు రిషి.. మనోడు లోకల్ లో మంచి రేసర్.  లండన్ వెళ్లి తెల్లపిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకున్నాడు” అని సత్య చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

Advertisement

అయితే ఇంకోపక్క రుక్మిణీ దొంగ దొంగ అని పిలవడంతో.. ఇక్కడ రిషి ఒక దొంగ అని తెలుస్తోంది. ఇక వీరి మధ్య పరిచయం.. ప్రేమగా మారే సమయానికి రుక్మిణీ.. తన ఫ్రెండ్ చిత్ర(దివ్యాంష) గురించి చెప్తూ అతని భర్త చాలా మంచివాడని చెప్తుంది. అయితే ఆమె ఫ్రెండ్ భర్త రిషినే అని చూపించడం హైలైట్. ఇక మధ్యలో విలన్స్ దేనికోసమో వెతకడం..  అది రిషి దగ్గర ఉండడం చూపించారు.  అసలు చిత్ర ఏమైంది.. ? లండన్ లో రిషిని పోలీసులు ఎందుకు వెంటపడుతున్నారు..? రిషి చేసిన తప్పేంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇద్దరు భామల మధ్య నలిగిపోయే ప్రేమికుడిలా నిఖిల్ ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సుధీర్  వర్మ – నిఖిల్ కాంబోలో వచ్చిన స్వామి రారా  ఏ రేంజ్  హిట్ అయ్యిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నిఖిల్ ని హీరోగా నిలబెట్టింది ఆ సినిమానే.  చాలా గ్యాప్ తరువాత ఈ కాంబో మళ్లీ రీపీట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement

ఇక చివర్లో నిఖిల్.. “ప్రపంచంలో 90 శాతం అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా” అని చెప్పిన డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. స్వామి రారా పోలికలు కనిపిస్తున్నాయి. దానికి, దీనికి ఏదైనా  కనెక్షన్ ఉంటుందేమో చూడాలి.  ఇకపోతే ఈ సినిమా నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నిఖిల్, సుధీర్ వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×