E-Paper
Advertisement

Nithiin: తమ్ముడు సినిమాలో పవన్ సాంగ్.. అంతా ఉత్తిత్తే అంట

Nithiin: తమ్ముడు సినిమాలో పవన్ సాంగ్.. అంతా ఉత్తిత్తే అంట
Advertisement

Nithiin: యంగ్ హీరో నితిన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద ఫ్యానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలో పవన్ కు సంబంధించిన డైలాగ్ కానీ, సాంగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పటికే నితిన్.. గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలో పవన్ హిట్ సాంగ్ ఏమైందో అనే సాంగ్ ను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పవన్ టైటిల్ తోనే వస్తున్నాడు.

నితిన్ నటిస్తున్న తాజా చిత్రాల్లో తమ్ముడు ఒకటి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కన్నడ బ్యూటీ సప్తమి గౌడ నటిస్తుండగా.. సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ అవుతోంది. అదేంటంటే.. పవన్ నటించిన  తమ్ముడు  పేరునే కాదు.. పవన్ హిట్ సాంగ్స్ లో ఒక సాంగ్ ను కూడా నితిన్ రీమిక్స్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సిచ్యువేషన్ కు తగ్గట్టు ఆ సాంగ్ ను క్రియేట్ చేయాలనుకున్నారని కూడా వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలను మేకర్స్ కొట్టిపారేశారు. అదంతా ఏం లేదని,రాంగ్ న్యూస్ అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. పవన్ సాంగ్ ను రీమిక్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. నితిన్ కనుక రీమిక్స్ చేస్తే ఆ వైబ్ వేరేలా ఉంటుంది. ఒకవేళ ఇది జరిగినా కూడా ఫ్యాన్స్ అంగీకరించేవాళ్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇదంతా నిజం కాదు అని తెలియడంతో వారు నిరాశకు గురవుతున్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×