E-Paper
Advertisement

Amala Paul : ఆ ఆలయంలో అమలాపాల్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?

Amala Paul : ఆ ఆలయంలో అమలాపాల్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?
Advertisement

Amala Paul :దేశంలో కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో మహిళలకు ఎంట్రీ లేదు. పురాతనకాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎంతో వివాదం నడిచింది. కొందరు మహిళలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దర్శనానికి వెళ్లారు. అలాగే దేశంలోని చాలా ఆలయాల్లో ఇతర మతస్థులను దైవ దర్శనానికి అనుమతించడంలేదు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ అమలాపాల్ కు స్వరాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి ఆమెను అనుమతించలేదు. హిందువు కాకపోవడం వల్లే ఆలయ అధికారులు ఆమెను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై అమలాపాల్ ఆవేదనకు గురయ్యారు. తన బాధను టెంపుల్ విజిటర్స్ రిజిస్టర్‌లో నోట్‌ పెట్టారని వార్తలు వచ్చాయి.

2023లో కూడా మతపరమైన వివక్ష ఉండటం విచారకరమని అమలాపాల్ ఆ నోట్ లో పేర్కొన్నారు. తాను ఆ దైవం దగ్గరకు దర్శనానికి వెళ్లలేకపోయానని, దూరం నుంచే ఆ అనుభూతిని పొందగలిగానని వివరించారు. మతపరమైన బేధాలు త్వరలోనే సమసిపోతాయని భావిస్తున్నానని , మనమంతా ఒక్కటే అనే చెప్పే సమయం తప్పక వస్తుందని అమలాపాల్‌ రిజిస్టర్‌లో రాశారని తెలుస్తోంది.

Advertisement

అమలాపాల్ ను ఆలయంలోకి అనుమతించకపోవడంపై ఆలయ ట్రస్ట్‌ కార్యదర్శి వివరణ ఇచ్చారు. తాము ప్రొటోకాల్‌ను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఎంతోమంది అన్యమతస్థులు వస్తుంటారని తెలిపారు. వారిని అనుమతించమని వెల్లడించారు. సెలబ్రిటీలకైనా అదే వర్తిస్తుందన్నారు. కానీ సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం ఈ విషయం వివాదాస్పదమవుతుందన్నారు.

కేరళకు చెందిన అమలాపాల్ తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. బెజవాడ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు, పిట్ట కథలు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తనను టెంపుల్ లోకి అనుమతించకపోవడంపై అమలాపాల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ వివాదం సమసిపోయినట్టేనా..?

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×