E-Paper
Advertisement

Kanguva 2: కంగువతో పోటీపడే ధైర్యం ఎవరికీ లేదు..

Kanguva 2: కంగువతో పోటీపడే ధైర్యం ఎవరికీ లేదు..
Advertisement

Kanguva 2: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దిశా పటానీ జంటగా నటిస్తున్న చిత్రం కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా వంశీ-ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇదే రోజున కంగువతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీని గురించి నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడంటే కంగువ సినిమాకు పోటీ వస్తున్నారు కానీ, కంగువ 2 కు మాత్రం ఎవరు పోటీ రాలేరు అని చెప్పుకొచ్చాడు.

Advertisement

“కంగువ కథ గురించి ఎవరికి తెలియదు కాబట్టి మిగతా సినిమాలు పోటీకి వస్తున్నాయి. కానీ, కంగువ 2 కు మాత్రం ఎవరు పోటీకి వచ్చే ధైర్యం చేయలేరు. ఈ విషయం ఎంతో నమ్మకంగా చెప్తున్నాను. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది” అని చెప్పుకొచ్చాడు. అయితే జ్ఞానవేల్ రాజా ఇలా చెప్పడం మొదటిసారి కాదు. మొదటి నుంచి కూడా కంగువ గురించి నిర్మాత ఇలానే చెప్పుకొస్తున్నాడు.

సూర్య సినిమా రూ.1000 కోట్లు సాధించడమే లక్ష్యమని, పార్ట్ 1 హిట్ అయితే సీక్వెల్ ప్లాన్ చేస్తామని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నిర్మాత చెప్పినట్లు ఉంటుందో లేదో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×